
నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, తొలి సినిమా ద్వారా తన ఆకట్టుకునే అందం అభినయం తో ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఆ తరువాత వరుణ్ తేజ్ సరసన ఆమె నటించిన ముకుంద సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికి పూజా నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే రెండేళ్ల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అరవింద సమేత సినిమా తో కెరీర్ పరంగా ఫస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పూజా, ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
రిలీజ్ తరువాత ఆ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టి పూజా కి మరింత పేరు తెచ్చిపెట్టింది. ఇక వీటి అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గద్దలకొండ గణేష్ మూవీలో కూడా నటించి ఆ మూవీ ద్వారా కూడా మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న పూజా, గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో మూవీ తో ఇంకొక భారీ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ, అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తీస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో కూడా నటిస్తోంది.
అయితే వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది. చరణ్ ఈ సినిమాలో సిద్ద అనే కామ్రేడ్ గా నటిస్తుండగా పూజా హెగ్డే ఒక గిరిజన యువతి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఆమె పాత్ర సినిమాలో కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ ఆ పాత్ర ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందని అంటున్నారు. మొత్తంగా తొలిసారిగా రామ్ చరణ్ తో నటిస్తున్న పూజా రాబోయే రోజుల్లో తన సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ లు అందుకుంటుందో చూడాలి.....!!