అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం హిందీలో చేసిన సినిమా ముంబై సాగా గ్యాంగ్ స్ట‌ర్ వ‌ర్సెస్ సీరియ‌స్ కాప్ డ్రామా గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మధ్య కాలంలో హిందీలో ఈ తరహా చిత్రాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. జాన్ అబ్ర‌హాం, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పోలీసు పాత్రలో ఇమ్రాన్ హ‌స్మి హీరోకి ప్రత్యర్థి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహించగా..భూషణ్ కుమార్- క్రిషన్ కుమార్- అనురాధ గుప్తా- సంగీత అహిర్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగులో నేనే రాజు నేనే మంత్రి సినిమా లో హీరో రానా పక్కన ఎంతో హుందాగా ట్రెడిషనల్ గా కనిపించిన కాజల్... ఈ సినిమాలో అంతకుమించిన క్యారెక్టర్ లో ఒదిగి పోయిందని టాక్.

తాజాగా ముంబై సాగా చిత్రం నుండి  డంకా బాజా పాట విడుదల చేసింది చిత్ర బృందం. గణేశోత్సవ్ సంబరాల్లో భాగంగా చిత్రీకరించిన ఈ పాట లో కాజల్ ఎంతో ట్రెడిషనల్ గా కనిపించగా... హీరో జాన్ అబ్ర‌హాం మాస్ లుక్ లో  గ్యాంగ్ స్టార్ గా ఎట్రాక్ట్ చేస్తున్నారు. మొదట్లో ఈ  సినిమా రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ కి ఇవ్వడానికి సంప్రదింపులు జరుపుకున్నప్పటికీ... ఆ తర్వాత నేరుగా థియేటర్లోనే రిలీజ్ చేసేందుకు నిర్ణయించింది ఈ సినిమా యూనిట్. ఈ చిత్రం మార్చి 19 న థియేటర్లలో రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. మరి... ఈ భారీ యాక్ష‌న్ మూవీని ప్రేక్షకులు ఏ రేంజ్లో ఆదరిస్తారో చూడాలి.

ఇదిలా ఉండగా... అప్పట్లో హిందీలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి  హీరోల పక్కన నటించిన తర్వాత కూడా మన చందమామ కాజల్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన హిట్లను పక్కన పెట్టి.. దో లఫ్జోంకీ కహానీ డిజాస్టర్‌ ని దృష్టిలో పెట్టుకొని ఈమెకు ఛాన్స్ ఇవ్వలేదు బాలీవుడ్ దర్శక నిర్మాతలు. అందుకే ఆ సినిమా తర్వాత మళ్లీ ఉత్తరాది వైపు వెళ్లే ప్రయత్నం చేయలేదు కాజల్. ఇలాంటి సమయంలో ఈమెకు దక్కిన గోల్డెన్ ఛాన్స్ ముంబై సాగా. అయితే ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్ లో తన లక్ ను పరీక్షించుకోనుంది కాజల్

మరింత సమాచారం తెలుసుకోండి: