అగ్రనటులతో సినిమాలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు సహజం. అవును అని వెంటనే అనేయకండి. ఆ ఇబ్బందులు ఎవరికీ అంటే... అధికారాలు లేని నిర్మాతకు కావచ్చు, చిన్నవాడైన దర్శకుడికి కావొచ్చు, లేదా సంగీత దర్శకుడికి కూడా కావొచ్చు. ఈ రామాయణమంతా ఎందుకూ అంటే... సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్ర పరిస్థితి గురించి. ఈ సినిమాకు సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్. మహేష్ బాబు, వెంకటేష్, దిల్ రాజు, మిక్కీ జె మేయర్... ఈ నలుగురూ ఈ చిత్ర బ్రుంద సభ్యులు. వీరిలో నోట్లో నాలుకలేనిది ఎవరికీ అంటే మేయర్ కే. ఎందుకంటే... మేయర్ కి ఇప్పటివరకూ అవకాశాలిస్తూ ఆదుకుంటున్నది దిల్ రాజే. ఇక, వెంకీ, ప్రిన్స్ లతో మాట్లాడే స్థాయి కాదు మేయర్ ది. అందుకే, పాపం తెగ నలిగిపోతున్నాడట అతడు. సినిమాకు ఆరు పాటలా ఏడా లేక ఎనిమిది పాటలా అన్నది ఇప్పటివరకూ తేలలేదట. అవి తేల్తేగానీ... ఆడియో విడుదల ఎప్పుడువుతుందో చెప్పడం కష్టం. అందుకే, దిల్ రాజు ఆడియో విడుదల ప్రకటన చేయలేదు. రెండు చుక్కలు పెట్టి చాలా షరతులు వర్తిస్తాయి అన్నట్టు... అసలు, సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలిస్తే ఇవన్నీ తెలుస్తాయి. పాపం, ఎన్ని ట్యూన్లు చేస్తున్నాడో ఏంటో మేయర్.   

మరింత సమాచారం తెలుసుకోండి: