
ఓ హీరోయిన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చి, స్టార్ డంని సంపాదించుకోవడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కష్టపడాలి. అలాంటిది ఇండస్ట్రీకి వచ్చిందో, లేదో ఏకంగా ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలతో డేటింగ్ వ్యవహారాన్ని నడుపుతుంది ఆ బ్యూటి. తనే లక్ష్మీమీనన్. వివరాల్లోకి వెళితే, కుంకీ చిత్రంతో తమిళ తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇటీవల విడుదలైన అన్ని చిత్రాలు విజయం కావడంతో యమా జ్యోష్ మీదుందీ బ్యూటీ.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీపై కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. గతంలో విశాల్ సరసన నటించి, ఆయనతో ప్రేమలో పడిందనే వార్తలు వెల్లడి కావడంతో, ఈ బ్యూటీ పై అందరి దృష్టి పడింది. దీనికి సంబంధించిన విషయాన్ని అడగగా తను నవ్వి ఊరుకుంది. అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై ఫుల్ క్లారిటి ఇచ్చింది. తను ఓ మ్యాగజైన్ చదువుతుండగా అందులో 15 హీరోలతో డేటింగ్ చేసినట్టుగా లక్ష్మీమీనన్ పై న్యూస్ ఉంది.
దీంతో తను ఎంత మాత్రం షాక్ కాకుండా ఆ న్యూస్ ని ఎంజాయ్ చేసింది. అలాగే, ఈ భామకి మాత్రం తనకు గాసిప్స్ అంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా తనపై వచ్చే గాసిప్స్ అంటే ఇంకా ఇష్టమని అంటోంది. పైగా మీకు కావలసినంత మసాలా వేసుకుని రాసుకోండి అని చెబుతోంది హాట్ భామ లక్ష్మీ మీనన్?. అందుకే తనపై రోజుకో హీరోతో ఎఫైర్ ఉందని రాసినా ఏ మాత్రం బాధపడను అని చెబుతుంది.
ప్రస్తుతం
కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిగా
ఉన్న ఈ అమ్మడు ఇటీవలే ఈ గాసిప్స్
పై స్పందిస్తూ ఇలాంటివి కామన్,
వీటిని
చదవి బాగా ఎంజాయ్ చేస్తానని
చెప్పింది. తనపై
రాసేవాటిని కూడా ఆసక్తితో
చదువుతానని అంటూ గడుసు
సమాధానాలు చెబుతున్న ఈ బ్యూటిని
చూసి, ఏదేమైనా
లక్ష్మీకి కాస్త డేర్ ఎక్కువే
అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.