టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ "వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా మంచి సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. ఇక ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని చేసిన సినిమా "జాతి రత్నాలు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నవీన్ కి జంటగా నటించింది. కె.వి.అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి స్టార్ కమెడియన్స్ కూడా టైటిల్ రోల్స్ ప్లే చేశారు. 'స్వప్న సినిమా' బ్యానర్ పై 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 11న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది.ఆ ఓపెనింగ్స్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకుపోతుంది.ఇక మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుంది.


ఇక 'జాతి రత్నాలు' సినిమాకి 10.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 11.3కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.3 రోజుల్లోనే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ సినిమా 4 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా 20.44 కోట్ల షేర్ ను రాబట్టి ట్రేడ్ కు సైతం షాక్ ఇచ్చింది.మొదటిరోజు కంటే కూడా 4వ రోజున ఈ చిత్రం ఎక్కువ కలెక్ట్ చేసింది. నిన్న ఒక్క రోజే ఈ చిత్రం 5.3 కోట్ల పైనే షేర్ ను నమోదు చెయ్యడం విశేషం.ఇక అద్భుతమైన వసూళ్లతో ఈ సినిమా పెద్ద డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నవీన్ ని స్టార్ హీరోని చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: