ఇప్పటికే ఇందులోని సాంగ్స్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి అందరి నుండి మంచి స్పందన రాబట్టడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందులో ఒక పవర్ఫుల్ లాయర్ పాత్ర చేస్తుండగా ఇతర పాత్రల్లో అనన్య నాగళ్ల, అంజలి, నివేదాథామస్, ప్రకాష్ రాజ్, మురళీశర్మ తదితరులు నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతుండగా ఇటీవల షూటింగ్ మొత్తం ముగించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతంగా నిర్వహిస్తోంది యూనిట్. ఇక ఈ సినిమా అధికారిక థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 29న రిలీజ్ చేయబోతున్నాం అంటూ నిర్మాతలు కొద్దిసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటన చేశారు.
ఇటీవల రిలీజ్ అయిన వకీల్ సాబ్ టీజర్ కి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో అనంతరం రాబోతున్న ట్రైలర్ కు మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని ఆ తర్వాత మూవీ కూడా అత్యధిక కలెక్షన్లు అందుకుని భారీ స్థాయి సక్సెస్ అందుకోవడం ఖాయమని పలువురు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్ చేస్తున్నారు. మరి చాలా గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న వకీల్ సాబ్ సాబ్ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి