ఇక దీని తర్వాత మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎల్ నారాయణ నిర్మించనున్న భారీ పాన్ ఇండియా సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ మూవీ ప్రారంభానికి ఇంకా మరికొన్ని నెలలు సమయం పట్టడంతో ఈలోపు తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తో చేయాలని మహేష్ డిసైడ్ అయ్యారు అనే వార్త కొద్ది రోజుల నుంచి ప్రచారం అవుతుంది. అయితే తన నెక్స్ట్ సినిమా మహేష్ తో అంటూ ఎప్పుడైతే రాజమౌళి ఆ సినిమా గురించి ప్రకటన చేసారో అప్పటి నుంచి వారిద్దరి కాంబో మూవీ పై పలు వార్తలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఇంతకీ ఈ సినిమా ఏ జానర్లో ఉంటుంది మహేష్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది అందరిలోనూ ఎంతో ఆసక్తికరంగా ఎప్పటినుండో జరుగుతున్న చర్చ.
ఇటీవల ఒక ప్రముఖ జాతీయ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తదుపరి మహేష్ తో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా కథ సౌత్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ డ్రామాగా ఎంతో భారీ రేంజ్ లో రూపొందనుందని చిన్న హింట్ ఇచ్చారు. నిజానికి ఆ మూవీ స్టోరీ కేవలం బిగినింగ్ స్టేజ్ లోనే ఉందని స్టోరీ ఇంకా పూర్తి కావడానికి ఎంతో సమయం పడుతుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క జానర్ మరియు స్టోరీలైన్ అదే అయినప్పటికీ కథలో ఎన్నో అత్యద్భుతమైన ఆసక్తికరమైన థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయని ముఖ్యంగా భారీ యాక్షన్ అలానే ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని అంటున్నారు.
మహేష్ బాబు క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఫ్యాన్స్ కి నచ్చే విధంగా అలానే అన్ని వర్గాల ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే విధంగా రాజమౌళి ఈ మూవీని తీయనున్నారట. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో పట్టాలెక్కే ఛాన్స్ కనపడుతుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13 న రిలీజ్ కాబోతుంది.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి