టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇండస్ట్రీలో ఆయన కొట్టని రికార్డులు లేవు.మెగాస్టార్
చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోని
టాలీవుడ్ టాప్ స్టార్ హీరోస్ లో ఒకడిగా ఎదిగాడు.ఆయన
టాలీవుడ్ సినీ పరిశ్రమకి ఆరడుగుల బుల్లెట్ లాంటివాడు. ఆయన చేసింది 26 సినిమాలే అయినా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్నాడు.ఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ఇక
పవర్ స్టార్ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో దాదాపు మూడు సంవత్సరాల తరువాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అనన్య నాగళ్ల,
అంజలి,
నివేదా థామస్ ముఖ్య పాత్రలు పోషించగా,
శృతి హాసన్ కథానాయికగా నటించింది. వేణు
శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
కరోనా వలన పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయిన
పవర్ స్టార్ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
పవన్ రీ ఎంట్రీ
సినిమా కావడంతో ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.ఇక
సినిమా విడుదల అయ్యి పెద్ద
బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది..ఇక అసలు విషయానికి వస్తే..ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వకీల్ సాబ్ మేనియా మొదలయ్యింది. ఈరోజు ఉదయం నుంచి ఏమంటూ బెనిఫిట్స్ షోస్ స్టార్ట్ అయ్యాయో అప్పట్నుంచి ప్రతి
పవర్ స్టార్ అభిమాని కరోనా ఉందని భయం కూడా లేకుండా
థియేటర్ లకి ఎగబడి వెళ్తున్నారు. తెగ సందడి చేస్తున్నారు. ఈ రేంజ్ లో హడావుడి పాన్
ఇండియా ఇండస్ట్రీ హిట్ అయినా బాహుబలికి కూడా చెయ్యలేదు. ఇక ఈ హడావిడి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో
బాహుబలి రికార్డులని బద్దలు కొట్టేలా కనిపిస్తుంది.