
ఆయనను సినీ, రాజకీయ ప్రముఖులు ఎవ్వరూ ఎన్ని మాటలన్నా కూడా దులిపేసుకొని మళ్లీ విమర్శలు చేయడం మొదలు పెడతారు.. అది వర్మ నైజం.. ఇప్పుడు బెంగాల్ రాజకీయాల పై వర్మ కన్ను పడింది.. నిన్న విడుదలైన ఫలితాల పై వర్మ తన శైలిలో కామెంట్లు విసురుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ' మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వర్మ స్పందిస్తూ, ఓ షార్ట్ వీడియోను షూట్ చేయించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో కు ' దీదీ ఓ దీదీ' అని పేరు పెట్టారు. ఇందులో మమతా బెనర్జీతో పాటు నరేంద్ర మోదీ, అమిత్ షాలు నటించారని కామెంట్ చేశారు. ఇక ఈ వీడియోలో ఓ హ్యాండ్ బ్యాగ్ తో ఒంటరిగా వస్తున్న యువతిపై, వెనుక నుంచి ఓ హై ఎండ్ బైక్ పై వచ్చిన ఇద్దరు అటకాయిస్తారు. ఈలోగా పారిపోయినట్టుగా పరిగెత్తే ఆ యువతి, తన చేతిలోని బ్యాగ్ ను దూరంగా విసిరేస్తుంది. వెంటనే ఆ ఇద్దరు బ్యాగ్ కోసం పరిగెత్తగా, వారు తెచ్చిన బైక్ ను నడుపుకుంటూ ఉడాయిస్తుంది.. ఈ వీడియో ను చూసిన బీజేపి శ్రేణులు వర్మ పై నిప్పులు చెరుగుతున్నారు.. దీని కన్నా ముందు మోదీ పై విమర్శలు గుప్పిస్తూ మరో ట్వీట్ చేశారు.అవి కాస్త ఎవరికీ కాలాలో వారికి మంట పెడుతున్నాయి.. మరి ఈ విషయం ఎంతవరకు వెళుతుంది అనేది చూడాలి..