మలయాళం సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్.. తెలుగులో రీమేక్ కాబోతున్న సంగతి విదితమే. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి రోజుకో న్యూస్ హాట్ టాపిక్ గా మారుతోంది. మల్టీస్టారర్ మూవీ అంటే ప్రేక్షకులకు ఆ మాత్రం ఆసక్తి ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే నిన్న.. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ ను సెలక్ట్ చేశారని టాక్ వినిపించగా, నేడు ఈ సినిమాకు సంబంధించిన మరో తాజా వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో బ్రహ్మాజీ కనిపించబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు జరిగాయని.. త్వరలో బ్రహ్మాజీ సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ భాగస్వామ్యంతో చేసే సినిమాలలో బ్రహ్మాజీ కోసం ఓ పాత్ర ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఈ రీమేక్ లో కూడా బ్రహ్మాజీ నటిస్తారు అనడంలో సందేహం లేదు అంటున్నారు నెటిజన్లు.  ఇక షూటింగ్ విషయానికొస్తే 60 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా, పవన్ షెడ్యూల్ ప్రకారం ఇంకో 25, 26 రోజులలో తన పార్ట్ కంప్లీట్ అవుతుందని సమాచారం. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని తేడా లేకుండా.. అన్ని పాత్రలలోనూ నటించి విలక్షణ నటుడిగా డిఫరెంట్ యాంగిల్ లో కనిపించనున్నాడట.

ఇక నటుడు బ్రహ్మాజీ ఈ చిత్రంలో రానా కార్ డ్రైవర్ గా నటించనున్నట్లు సినీ వర్గాల నుంచి అందుతున్న టాక్. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 12గా ఈ 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ తెరకెక్కుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- మాటలు  అందిస్తుండగా...సాగర్‌. కె.చంద్ర ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: