కరోనా పుణ్యమా అని ఇండియా లో సోనూసూద్ ఎప్పుడు ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తాడు. ఎందుకంటే దేశం నలుమూలలనుంచి కష్టం అన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేవిధంగా సోను సూద్ పనిచేశాడు.. బాలీవుడ్ నటుడు గా పలు సినిమాల్లో చేసి మంచి గుర్తింపు దక్కించుకున్న సోను సూద్ లాక్ డౌన్ టైంలో చేసిన సేవలను ఎవరు మర్చిపోలేరు.. ప్రజలు లాక్ డౌన్ వల్ల పడే ఇబ్బందిని గమనించి ముందుకొచ్చి వారికి ఎంతో సహాయం చేశాడు సోనూ.. ఓ వైపు కరోనా విజృంభిస్తున్న సోను మాత్రం అవేవీ లెక్క చేయకుండా ముందుకొచ్చి తన కర్తవ్యం నిర్వర్తించాడు.

చేసేది విలన్ పాత్రలే అయినా సోనూ సూద్ బయట మాత్రం రియల్ హీరో అని అయన అభిమానులు చెప్పుకున్నారు. ఇకపోతే సెకండ్ వేవ్ లోనూ అయన అదేవిధంగా సేవచేస్తూ ప్రజల్లో నిలిచిపోతున్నారు.. ట్విట్టర్ వేదికగా ఆయనకు కోట్ల రిక్వెస్ట్ లు వస్తున్నాయని అందరికి హెల్ప్ చేయలేకపోతున్నానని అయన చెప్తూ బాధపడ్డాడు.. ఓ ప్రభుత్వం తరహాలో సోనూ సూద్ చేసిన సేవలను ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోలేరు.. ఈనేపథ్యం లో సోనూ సూద్ ఆస్తుల చిట్టాని బయటకి తీస్తున్నారు కొందరు..

సినిమాల్లో నటిస్తూ రెమ్యూనరేషన్ తీసుకునే సోనూ సూద్ కి నాతనమాత్రమే కాకుండా అతనికి హోటల్ బిజినెస్ కూడా ఉంది. అన్నీ కలిపి సుమారు ఒక 130 కోట్లు పై మాటే ఉంటుందని సమాచారం. అయితే ఎన్ని కోట్లు ఉన్నాయన్నది విషయం కాదు ఎంత గొప్ప మనసు ఉన్నది అనేది ముఖ్యం అని అంటున్నారు అయన అభిమానులు.. అయితే ఇంత తక్కువ ఆస్థి తో అతను చేసే పనులు చూస్తే మాత్రం ఎవరైనాయి ఆశ్చర్యపోతారు.. ప్రస్తుతం దేశంలో కోట్లాదిమందిని అభిమానులుగా చేసుకుని ఆశీర్వాదాలు పొందుతున్నారు సోనూసూద్.. సోనూ సూద్ దగ్గర ఎంత డబ్బు ఉందో అంతకన్నా ఎక్కువ మంచితనం ఉంది అని ...అతను చల్లగా ఉండాలని వేలాది మంది కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: