బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఎక్సలెంట్ కోరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ ప్రభుదేవా కాంబినేషన్ లో 'రాధే' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వచ్చిన ఈ సినిమాను నెటిజన్స్ పని గట్టుకొని మరి సోషల్ మీడియాలో ఎంతగా ట్రోల్ చేశారో అందరికీ తెలిసిందే. ఎంత ట్రోల్ చేసి, నెగెటివ్ కామెంట్స్ చేస్తే ఏంటి…? ఫైనల్ గా సల్మాన్ ఖాన్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. ఇక ఈ సినిమాతో నష్టాలు పాలవుతారనుకున్న నిర్మాతలు లాభపడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ విషయంలో దర్శకనిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మొత్తం రూ.80 కోట్లు బడ్జెట్ ఖర్చు పెట్టడం జరిగింది.

థియేటర్లలో విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా పరిస్థితులు దారుణంగా ఉండటం వలన ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కలిపి జీ నెట్ వర్క్ వాళ్లకు ఒకేసారి అమ్మేయడం జరిగింది.ఈ డీల్ రూ.190 కోట్ల దగ్గర తెగింది. అంటే ప్రస్తుతానికి సల్మాన్ ఖాన్ కు పెట్టిన పెట్టుబడి తీసేయగా.. రూ.110 కోట్ల లాభం వచ్చిందట. ఈ సినిమాను కొన్న జీ నెట్ వర్క్ సంస్థకు కూడా బాగానే లాభాలు వచ్చాయి.

ఇక ఓటీటీ ప్లాట్ ఫారంలు, డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేసింది ఈ సంస్థ. కోటి మందికి పైగానే ఈ సినిమాను ఓటీటీ, డీటీహెచ్ లలో వీక్షించారు. ఆ లెక్క చూస్తే రూ.250 కోట్లకు పైగా ఆదాయం వచ్చి ఉంటుంది. ఇంకా జీ ఛానెల్స్ లో ఈ సినిమాను ప్రీమియర్ వేయాల్సి ఉంది. అలా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే జీ వాళ్లు కూడా వంద కోట్లకు తక్కువ కాకుండా సంపాదించుకుంటున్నారని తెలుస్తోంది.నిజానికి ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా చెత్తగా వుంది. కేవలం సల్మాన్ క్రేజ్ వలనే ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయినా లాభాలు దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: