ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నాజూకైన సొగసుతో ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసారు కమలినీ ముఖర్జీ. ఈ ముద్దుగుమ్మ అందాలకు హ్యాపీడేస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా మంత్రముగ్ధులయ్యారు. అంతేకాకుండా ఆయన తన డైరెక్టోరియల్ "ఆనంద్(2004)" సినిమాలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. చక్కటి కథతో రూపొందిన ఆనంద్ సినిమా ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం గెలుచుకుంది. అయితే అందమైన కథను అద్భుతమైన దృశ్యకావ్యంగా మలిచిన శేఖర్ కమ్ముల కి ఉత్తమ దర్శకునిగా నంది పురస్కారం లభించింది.


ఉత్తమ నటీమణిగా కమలినీ ముఖర్జీ కూడా ఒక నంది అవార్డును సొంతం చేసుకున్నారు. అయితే రమణీయమైన కమలినీ ముఖర్జీ కి మధురమైన గాత్ర దానం చేసినందుకు గాను ప్రముఖ సింగర్ సునీత ఉపద్రష్ట కి కూడా నంది పురస్కారం లభించింది. అయితే ఆనంద్ సినిమా భారీ స్థాయిలో విజయవంతం కావడానికి కమలినీ ముఖర్జీ అందమే కారణమని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఆమె కె.ఎం రాధాకృష్ణ స్వరపరిచిన యమునా తీరం పాటలో చీరకట్టు అందాలతో ప్రేక్షకుల హృదయాలను మీటారు. ఆనంద్ సినిమా చూస్తుంటే ఇప్పటికీ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అంటే దానికి కారణం కమలినీ ముఖర్జీ యొక్క మురిపమైన అందాలేనని చెప్పుకోవచ్చు.



అయితే కమలినీ ముఖర్జీ శేఖర్ కమ్ముల రూపొందించిన గోదావరి సినిమాలో కూడా కథానాయికగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు సైతం సంపాదించింది. సినిమా కూడా నంది అవార్డులతో పాటు పలు ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను అందుకుంది. మనోరంజకమైన చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో కూడా కమలినీ ముఖర్జీ తన అందచందాలతో ప్రేక్షకుల హృదయాలను పులకరింప చేశారు. అయితే హ్యాపీ డేస్ సినిమాలో కూడా శేఖర్ కమ్ముల ఈ అందాలరాశికి ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో కూడా శేఖర్ కమ్ముల ఆమె అందాలను ప్రత్యేకంగా చూపించారు. అయితే కమలినీ ముఖర్జీ శేఖర్ కమ్ముల సినిమాలు అందాల విందుకు చిరునామా అయ్యాయని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: