
ఈ సినిమాలో ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా గోపీచంద్ నటించిన ఈ సినిమా 2010 మే27న విడుదలైంది. పూరి మార్క్ డైలాగ్స్, యాక్షన్, టేకింగ్ తో ఈ సినిమా తెరకెక్కింది. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ను తనదైన స్టైల్లో నిజంగా పోలీస్ ఎన్ కౌంటర్స్ దగ్గన నుంచి చూస్తున్న ఫీల్ తీసుకొచ్చాడు పూరి. పూరికి ఇష్టమైన గ్యాంగ్ స్టర్ కథాంశాన్ని జోడించి పోలీస్ కథాంశాన్ని జోడించాడు. గన్స్ వాడకాన్ని కూడా పూరి చూపించినట్టు మరెవరూ చూపించ లేరు. పోకిరి తరహాలోనే సెకండాఫ్ లో సస్పెన్స్ రివీల్ అవుతుంది. సినిమాలో గోపీచంద్ హీరోనే అయినా పాత్ర పరంగా చాలా రఫ్ గా చూపించి ఆకట్టుకున్నాడు పూరి.
అయితే పూరి డైరక్షన్ లో గోపీచంద్ నటించిన మొదటి సినిమా ఇది. తన బాడీ లాంగ్వేజ్ తో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. హీరోయిన్ గా ప్రియమణి నటించింది. తన గ్లామర్ తో, సరదా యాక్టింగ్ తో ఆకట్టుకుంది. చక్రి సంగీతంలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ కూడా ఆకట్టుకుంటుంది. ప్రియమణి తల్లిగా రోజా నటించింది. శ్రీ సాయి గణేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేశ్ ఈ సినిమాను నిర్మించాడు.