స్టార్ హీరోలందరూ సినిమాలకు దూరం కావడం, రాజకీయాల్లో ప్రవేశించడం తిరిగి సినీ ఇండస్ట్రీలోకి వచ్చి తమ హవాను కొనసాగించడం ఇలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో షరా మామూలే అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ద్వారా రాజకీయాల నుండి తిరిగి సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించగా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం రాజశేఖర్ కూడా శేఖర్ తెలుగులో... మలయాళం సినిమా రీమేక్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా, మన బాలయ్య బాబు కూడా అఖండ  సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు.


ఈయన తన 106 వ  చిత్రంగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం అఖండ. ఈ సినిమాను ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారు. అయితే ఇప్పటికీ గత కొన్ని నెలల క్రితం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై, అనతికాలంలోనే 50 మిలియన్ల వ్యూస్ కి పైగా నమోదు చేసి రికార్డు సృష్టించింది. అయితే రేపు అనగా జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా అఖండ మూవీకి సంబంధించిన ఒక పోస్టర్ని కూడా , ఈ రోజు విడుదల చేసి అభిమానులకు ఆనందాన్ని కలుగచేశారు ఈ చిత్రం మేకర్స్.



ఇదిలా ఉండగా బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా తన 107 వ చిత్రాన్ని కూడా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుండగా, గోపీచంద్ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటివరకు తన 107 వ చిత్రం ఉంటుందో లేదో కూడా ఎవరికీ చెప్పకుండానే , తన పుట్టినరోజు సందర్భంగా సస్పెన్షన్ ను రిలీజ్ చేశారు బాలకృష్ణ. అఖండ మూవీ తరువాత గోపీచంద్ మలినేని - బాలకృష్ణ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతోందని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు నిర్మిస్తున్నారని , మైత్రి మూవీ  తమ అఫీషియల్ వెబ్ సైట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు...


మరింత సమాచారం తెలుసుకోండి: