టాలీవుడ్ లో ఎన్నో మరపురాని సినిమాలు వచ్చాయి అవి ఆయా హీరోల కెరీర్లో మైలురాయిగా నిలిచాయి. మళ్లీ అలాంటి సినిమా చేద్దామన్న చేయలేకపోతున్నారు సదరు హీరోలు. మోహన్ బాబు కెరీర్ లో ఎంతో సూపర్ హిట్ అయిన చిత్రం పెదరాయుడు. మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఆయన కెరీర్లో సూపర్ డూపర్ హిట్ గా నిలవగా మోహన్ బాబు క్రేజ్ నీ అమాంతం పెంచిన సినిమా ఇది. అప్పటివరకు సాదాసీదా సినిమాలను చేసిన మోహన్ బాబు ఈ సినిమా తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.

రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో 1995లో విడుదలైన ఈ సినిమా లో సౌందర్య, భానుప్రియ హీరోయిన్ గా నటించగా ఓ తమిళ సినిమాకు ఇది రీమేక్.  పెదరాయుడు సినిమా లో మరొక ముఖ్యమైన పాత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పాత్ర. ఈ సినిమాలోని కొద్ది భాగం కనిపించే రజనీ పాత్ర ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాను చూసిన రజనీకాంత్ మోహన్ బాబు ఫోన్ చేసి ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కిస్తే మంచి విజయాన్ని సాధిస్తుందని తన అభిప్రాయం చెప్పాడట. వెంటనే మోహన్ బాబు ఆ చిత్రానికి హక్కులు కొనుగోలు చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు. 

మోహన్ బాబు కాపీ హక్కులు కొనుగోలు చేయగానే రజినీకాంత్ తను పాపారాయుడు పాత్ర చేస్తానని తెలిపారట. మోహన్ బాబు నిడివి తక్కువగా ఉందని సందేహించినా రజిని పాపారాయుడు పాత్ర తాను మాత్రమే చేయాలని కోరాడట. రజినీ ఈ పాత్రను చేయడానికి ఎలాంటి పారితోషకం తీసుకోలేదు. ఈ చర్య వీరిద్దరి స్నేహ బంధానికి నిదర్శనంగా చెప్పవచ్చు.  పెదరాయుడు తండ్రి పాపారాయుడు పాత్ర నిడివి తక్కువైనా కథకు ఆయువు పట్టులాంటిది. ఈ చిత్రం 25 వారాలు విజయవంతంగా ఆడి 200 రోజులు పూర్తి చేసుకోగా ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: