
అంతేకాదు అరియానాకి జిమ్ ట్రైనర్ గా ఆర్జీవి సలహాలు సూచనలు.. ఇక ఆర్జీవి మార్క్ కెమెరా యాంగిల్స్ లో అరియానా అందాలు అబ్బో టీజరే ఇలా ఉంటే ఇక ఫుల్ ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో అనేంతగా ఈ టీజర్ కట్ చేశారు. అటు ఆర్జీవి ఛానెల్.. ఇటు అరియానా ఛానెల్ లో కాకుండా కొత్తగా భళా ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానెల్ లో ఈ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ మొత్తం ఆర్జీవి తీసె సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో హీరోయిన్ అందాల మీద ఫోకస్ చేసినట్టుగా హంగామా చేస్తుంది.
ఆర్జీవి ఇంటర్వ్యూతోనే సూపర్ ఫేమస్ అయ్యి బిగ్ బాస్ కు వెళ్లిన అరియానా ఆయన రుణం ఇలా తీర్చేసుకుంటుందని చెప్పొచ్చు. ఆర్జీవి.. అరియానా ఇద్దరు ఏమాత్రం తగ్గని ఈ బోల్డ్ ఇంటర్వ్యూలో ఎన్ని బోల్డ్ స్టేట్మెంట్స్.. ఎన్ని షాకింగ్ ఆన్సర్స్ ఉంటాయో అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా ఆర్జీవి విత్ అరియానా టీజర్ మాత్రం ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది. చూస్తుంటే ఫుల్ ఇంటర్వ్యూ ఆర్జీవి ఇంకా అరియానా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. బిగ్ బాస్ తర్వాత అరియానా ఫాలోయింగ్ కూడా పెరగగా ఆమె చేస్తున్న యాక్టివిటీస్ అన్ని ఆమె క్రేజ్ ను మరింత పెరిగేలా చేస్తున్నాయి.