
ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోలుగా నటించే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకే హీరోయిన్ తో కలిసి రొమాన్స్ చేయబోతున్నారా? అని అడిగితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ. ఇటీవల ఈ ముద్దుగుమ్మ నగ్నంగా దర్శనమిచ్చి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. డబూ రత్నానీ క్యాలెండర్ ఫోటో షూట్ కోసం ఆమె న్యూడ్ అవతారంలో కనిపించి సెగలు పుట్టించారు.
అయితే తాజా నివేదికల ప్రకారం ఈ సెక్సీ భామ రామ్ చరణ్ 15వ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది అగ్రతారలను సంప్రదించారు కానీ చివరికి కియారా ని ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది. జూలై 31వ తేదీన రామ్ చరణ్ 15వ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్న విషయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే జులై 31 కియారా అద్వానీ పుట్టిన రోజు.
మరోపక్క కియారా అద్వానీ జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా లో హీరోయిన్ గా నటించనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. కానీ ఈ విషయమై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే మహేష్ బాబు తో జత కట్టారు. అలాగే రామ్ చరణ్ తో కలిసి కూడా ఆమె రొమాన్స్ చేశారు. ఆ తర్వాత కూడా ఆమెకు టాలీవుడ్ దర్శకుల నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ ఆమె తన బిజీ షెడ్యూల్ కారణంగా కొన్ని ఆఫర్ వదులుకున్నారు. ఇక మిగతా ఆఫర్స్ ఆమెను మెప్పించలేకపోయాయి. కానీ టాలీవుడ్ అగ్రహీరోలు అయిన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ దిగ్గజ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాల ఆఫర్లను ఆమె ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోవడానికి ఇష్టపడరని చెప్పుకోవచ్చు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం ఆమె తన అభిమానులతో లైవ్ సెషన్ లో మాట్లాడుతూ టాలీవుడ్ కి సంబంధించి ఒక ఎక్సైటింగ్ అప్డేట్ తన నుంచి రానుందని చెప్పారు. దీంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.