వెన్నెల కిషోర్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న గొప్ప నటుడు. ఇతని పేరు వింటేనే తెలుగు సినీ ప్రేక్షకుల ముఖంపై తెలియకుండానే చిరునవ్వు విరభూస్తుంది, మనసులో ఆనందం వెల్లివిరుస్తుంది అంతగా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు వెన్నెల కిషోర్. కామెడీ అంటే కిషోర్, కిషోర్ అంటే కామెడీ అన్నంతగా తన పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. అయితే గతంలో సునీల్, సంపూర్ణేష్ బాబు, సప్తగిరి వంటి ప్రముఖ కమెడియన్ లు హీరోలుగా మారి పలు చిత్రాల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే తరహాలో వెన్నెల కిషోర్ కూడా ఓ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు చెబుతున్నారు.
కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హాస్యాన్ని ప్రధానంగా చేసుకుని హారర్ కాన్సెప్ట్ ను జోడించి తెరకెక్కించనున్నారు. వెన్నెల కిషోర్ నటించబోతున్న ఈ చిత్రంలో కాంచన సినిమా లెవల్ లో కామెడీతో పాటు, హారర్ పార్ట్ కూడా ఉండబోతుందనీ సినీ వర్గాల నుండి సమాచారం. ఇంతకు ముందు సందీప్ కిషన్ మరియు వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో 'నిను వీడని నీడను నేను' అనే చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందగా, ఇప్పుడు ఇంచుమించు ఇదే తరహాలో వెన్నెల కిషోర్ ఒక్కడే సినిమాని హ్యాండిల్ చేయబోతున్నారని అంటున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ పాత్ర కీలకం కానుంది అని తెలుస్తోంది.
మామూలుగా సినిమాలో వెన్నెల కిషోర్ ఉన్నాడు అంటే కడుపుబ్బ నవ్వుకోవడం గ్యారెంటీ అని ఫీల్ అయ్యే ప్రేక్షకులకు ఈ వార్త నిజంగానే పండుగ లాంటిది మరి. వెండితెరపై వెన్నెల కిషోర్ కాసేపు కనిపిస్తేనే కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాడు అలాంటిది ప్రధాన పాత్రలో పూర్తి సినిమాలో కనిపించబోతున్నారు అంటే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదని, కామెడీ అంతకుమించి అని చెబుతున్నారు. దాదాపుగా ఈ సినిమా ఓకే అయిపోయింది అని లాక్ డౌన్ అనంతరం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ అంశంపై ఒక స్పష్టత రావాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే...

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి