తమిళనాడు లో టాప్ హీరో గా దూసుకుపోతున్న హీరోలలో ఒకరు విజయ్ దళపతి. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఈయనే నెంబర్ వన్ హీరోగా తమిళనాడు కొనసాగుతున్నారని కూడా చెప్పవచ్చు. వరస మంచి కాన్సెప్ట్ లతో హిట్లు సాధిస్తూ టాప్ హీరో రేంజ్ కు వచ్చాడు విజయ్. ఇటీవలే ఆయన హీరోగా తెరకెక్కిన మాస్టర్ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా మంచి ప్రశంసలు సైతం అందుకుంది. మరొక స్టార్ హీరో ను ఇందులో విలన్ గా నటింప చేసి భారీ ప్రయోగం చేసి హిట్ కొట్టాడు.

అంతేకాకుండా డైరెక్ట్ గా తెలుగులో నేరుగా సినిమా  చేసి ఇక్కడ కూడా తన స్టార్డమ్ ను నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆయన టాలీవుడ్ టాప్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణంలో ఓ డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. దీని కోసం ఏకంగా వంద కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా బీస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్ర బృందం. 

అయితే ఈ టైటిల్ పెట్టడంతో తమిళంలోని కొన్ని రాజకీయ వర్గాలు విజయ్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి.  ఇప్పటివరకు 65 చిత్రాల్లో నటించిన విజయ్ బిగిల్, మాస్టర్ వంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకోగా ఈ టైటిల్స్ కొంతమేరకు ప్రేక్షకుల మనసును తాకే  విధంగా ఉన్నాయి. తాజాగా పెట్టిన బీస్ట్ టైటిల్ విమర్శలకు దారి తీస్తోంది. విజయ్ తమిళ టైటిల్స్ కి వ్యతిరేకమా అన్న ప్రశ్నను ఉత్పన్నమయ్యేలా చేస్తుంది. కోలీవుడ్ లో అగ్ర హీరో అయిన విజయ్ తన చిత్రాలకు వరుసగా ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సూపర్ స్టార్ ఒక్కటంటే ఒక్క చిత్రానికి టైటిల్ పెట్టకపోవడం గమనార్హం. అలాంటిది విజయ్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు ఇంగ్లీష్ టైటిల్స్ ని వాడటం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: