టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వారు  మహా అయితే పది సినిమాల కంటే ఎక్కువగాచేయరు.  అంతకంటే ఎక్కువగా సినిమాలు చేశారంటే వారి నటన లో ఏదో వెరైటీ ఉందని అర్థం. ఇప్పుడున్న చాలా మంది హీరోయిన్లు ఈ మధ్య కాలంలోనే వచ్చారు 10 సంవత్సరాల కిందట వచ్చిన హీరోయిన్ ఎవరు కూడా ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. అలా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కొత్తనీరు వచ్చి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉందని మేకర్స్  చెబుతున్నారు.  వారి ఆలోచనలకు తగ్గ బ్యూటీలు రావడంలేదని చెబుతున్నారు.

ముఖ్యంగా ఈ విషయంలో ప్రేక్షకులే న్యాయ నిర్ణేతలు. హీరోయిన్స్ విషయంలో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచులు మారుతూ ఉంటాయి. అందుకే స్టార్ హీరోయిన్ అనే క్రేజ్ పక్కనపెడితే ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త భామలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.  ప్రేక్షకులు ఇదివరకు స్టార్ హీరోయిన్ అన్నవారు ఇంకా ఎన్ని ఎక్కువ సినిమాలు చేస్తే అంత ఆనందించేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ప్రేక్షకులు చూసే విధానం లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు కొత్త అందాలను కోరుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త వాళ్లకు ఎల్లప్పుడూ ఆహ్వానం లభిస్తుంది. ఇటీవలే సోషల్ మీడియా వాడకం పెరిగాక ఆమె రేంజ్ ఫాలోయింగ్ లోనే తెలిసిపోతుంది.

అందుకే కొత్తగా ఎవరైనా హీరోయిన్ వస్తే ఆమె తన అందాలతో ప్రేక్షకులను మెప్పిస్తే ఆమెను పోలోమని ఫాలో అయిపోతున్నారు మన ప్రేక్షకులు. సినీ జనాలు చెప్పేదాని ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త నీరు అవసరం ఉంది అంటే కొత్త హీరోయిన్స్ కొత్త వయ్యారాలను కోరుకుంటున్నా ప్రేక్షకులు చాలా మంది ఉన్నారన్న మాట. టాలీవుడ్ హీరోలు కూడా న్యూ ఫేస్ లక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో ఇప్పుడు ఉన్నటువంటి మినిమం క్రేజీ హీరోయిన్స్ అందరూ బిజీ అయిపోయారు. తెలుగు అమ్మాయిల తో సినిమా చేద్దాం అంటే వారి వెబ్ సిరీస్ లకే అంకితమై పోతున్నారు. ఇలాంటి సమయంలో కచ్చితంగా ఇండస్ట్రీలో ఏదైనా పెద్ద సినిమా చేస్తే ఫామ్ లో ఉండే హీరోయిన్స్ కాకుండా న్యూ హీరోయిన్స్ కావాలని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: