విజయశాంతి , బాలకృష్ణ ఇద్దరు స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న సమయంలో వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. ఇక కలిసి నటించిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ గా , బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. స్టార్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, కృష్ణ వంటి హీరోలతో నటిస్తూ ఉన్న సమయంలో కర్తవ్యం లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం ద్వారా తన సత్తా ఏంటో చాటి,స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది. అగ్ర హీరోల సరసన నటించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్రలను కూడా ఏర్పరుచుకుని వాటిలో నటించడం విశేషం. అప్పట్లో విజయశాంతి క్రేజ్ స్టార్ హీరోలతో సమానంగా ఉండేది.


ఇక బాలకృష్ణ విషయానికొస్తే, బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా అభిమానులను , తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే వాడు. ఇదిలాఉండగా అప్పట్లో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని అనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. ప్రముఖ దివంగత మహానేత నందమూరి తారక రామారావు గారు బతికున్నప్పుడే బాలకృష్ణ విజయశాంతిని ప్రేమిస్తున్నట్లు ఆయనతో చెప్పారట. ఇక ఎన్టీఆర్ వీరిద్దరి ప్రేమను ఒప్పుకోలేదు అనే వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.


ఇక సినీ ఇండస్ట్రీలో వీరిద్దరి జోడీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. అంతే కాదు విజయశాంతిసినిమా తీసినా సరే, ఆ సినిమా కథలపై బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారట. ఆమెను అగ్ర దర్శకులకు పరిచయం చేసింది కూడా బాలకృష్ణ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ ని పెళ్ళి చేసుకోవద్దు అన్న తన తండ్రి మాట కోసం , బాలకృష్ణ విజయశాంతి పెళ్లి చేసుకోలేదని సమాచారం. అయితే బాలకృష్ణకు హుటాహుటిన పెళ్ళి జరగడం కూడా అయిపోయింది. ఇక బాలకృష్ణకు పెళ్ళి జరిగిన తరువాత కూడా వీరిద్దరి మధ్య ప్రేమాయణం జరిగిందనే వార్తలు చాలా హాట్ టాపిక్ గా మారాయి.


విజయశాంతి, బాలకృష్ణ తో ఏకంగా 16 సినిమాల్లో నటించి, మంచి విజయాన్ని అందుకోవడంతో కొంతమంది ఇలాంటి పుకార్లు సృష్టించారు అనే  వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయశాంతి పెళ్లి చేసుకున్న శ్రీనివాస్ కూడా బాలకృష్ణ కు అత్యంత స్నేహితుడు. కానీ ఇప్పటికీ విజయశాంతి , బాలకృష్ణ ల మధ్య స్నేహబంధమే ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనే వార్తలు మాత్రం వినిపిస్తూ, ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది ఈ జోడి. ముఖ్యంగా బాలకృష్ణ సన్నిహితుడైన శ్రీనివాస్ ను శాంతి వివాహం చేసుకోవడం వల్ల అంత సన్నిహితులుగా ఉంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: