మాయ చేసావే, 100% లవ్, మనం, ఒక లైలా కోసం, ప్రేమ వంటి ప్రేమ కథా చిత్రాల్లో నటించి మెప్పించిన నాగచైతన్య బెజవాడ సినిమాతో ఫ్యాక్షనిస్ట్ గా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ ధరించి కత్తి పట్టుకొని రౌడీలను నరుకుతూ ఉగ్ర అవతారం లో కనిపించి వావ్ అనిపించారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలలో నాగచైతన్య అద్భుతంగా నటించారు. బాడీ లాంగ్వేజ్ ఉగ్రమైన హావభావాలతో ఆయన మాస్ ఆడియన్స్ ని కట్టిపడేసారు.


నాగచైతన్య, సమంత కలిసి ఆటోనగర్ సూర్య సినిమాలో జంటగా నటించారు. అయితే సమంత నాగచైతన్య కలిసి ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ సినిమా చేయబోతున్నారని అందరూ భావించారు కానీ చైతు మాత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. దీన్నిబట్టి ఈ ఫ్యామిలీ హీరోకి యాక్షన్ చిత్రాల పై అమితమైన ప్రేమ ఉందని అర్థమయింది. బెజవాడ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ ఆయన ఆటోనగర్ సూర్య సినిమా చేశారు. అయితే ఈ సినిమాలో ఆయన తనలోని కొత్త కోణాన్ని చూపించే ఫ్యాన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశారు. డైరెక్టర్ దేవకట్టా రూపొందించిన ఈ చిత్రంలోని సీరియస్ రోల్ కోసం ఆయన చాలా కృషి చేశారు. రొమాంటిక్ హీరో నుంచి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకునేందుకు ఆయన పడిన కష్టం ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.



నాగ చైతన్య మరో సినిమా ధోని యాక్షన్ హీరోగా నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. కృష్ణ ఆర్‌వి మరిముత్తు రూపొందించిన యుద్ధం శరణం సినిమాలో ఆయన మాస్ అవతారంలో కనిపించారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న యువకుడి పాత్రలో నాగచైతన్య జీవించేసారనే చెప్పాలి. రొమాంటిక్ సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న చైతన్య యాక్షన్ జానర్ పై మక్కువతో పలు మాస్ చిత్రాలు చేశారు. కానీ సక్సెస్ సాధించలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: