టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ "అ ఆ" సినిమా తర్వాత, వరుస పెట్టి సినిమాలు చేసినప్పటికీ అనుకున్న విజయం మాత్రం అందలేదు. నిరాశ చెందిన ఈ యంగ్ హీరోకి బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దలయ్యే హిట్ ఇచ్చాడు వెంకీ కుడుముల. ఆ టైం లో ఛలో ఫేమ్ వెంకి కొడుముల డైరెక్షన్ లో చేసిన భీష్మ సినిమా నితిన్ కి సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన విషయం తెలిసినదే. స్ట్రాంగ్ కంటెంట్ ఉండడంతో అన్ సీజన్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు నితిన్. అయితే ఇపుడు మరోసారి ఇదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలనుకుంటున్నాడట ఈ హీరో. సాధారణంగా సెన్సేషనల్ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ తో తిరిగి సినిమా చేసేందుకు ఇష్టపడతారు హీరోలు.
ఇప్పుడు నితిన్ కూడా ఇదే తరహాలో తనకు బ్లాక్ బస్టర్ ను అందించిన వెంకీ కుడుములతో మరోసారి  వైవిధ్యభరితమైన కథతో మన ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య డిఫరెంట్ జోనర్స్ ను ఎంచుకుంటున్న నితిన్ ఇపుడు  వెంకీ కుడుముల డైరెక్షన్ లో మరో కొత్త రోల్ ను ట్రై చేయబోతున్నట్లు సమాచారం. గతంలో మునుపెన్నడూ లేని  విధంగా ఒక సరికొత్త పాత్రలో నితిన్ ని చూపించబోతున్నారట  వెంకీ కుడుముల. ఇదో పవర్ ఫుల్ మాస్ స్టోరీ అని తెలుస్తోంది. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ప్రస్తుతం హీరో నితిన్ ప్రముఖ డైరెక్టర్  మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ‘మాస్ట్రో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణలో పూర్తి చేసుకుందని సమాచారం. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ "అంధధూన్" కి ఇది రీమేక్ అన్నది తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ థియేటర్లు తిరిగి పునఃప్రారంభం, అవుతున్న తరుణంలో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: