
విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమా డిజిటల్ రిలీజ్ అవుతుందని నిన్న ప్రకటించారు. దాంతో ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఆనందం నెలకొంది. ఈ సినిమా థియేటర్ లలో వస్తుంది అని అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు అగ్ర ఓ టీ టీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో నారప్ప రావడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుండగా కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ధనుష్ నటించిన అసురన్ సినిమాకి రీమేక్.
కరోనా ప్రభావం కారణంగా టాలీవుడ్ లో చాలా సినిమాలు ఓ టీ టీ లోకి నేరుగా వచ్చేసాయి. అయితే ఇన్నాళ్లు లేని సమస్య నారప్ప దగ్గరకు వచ్చేసరికి కనిపిస్తోంది. ఆ సినిమాను డైరెక్ట్ ఓటీ టీ లో రిలీజ్ చేయవద్దు అంటూ పంపిణీదారులు ప్రదర్శనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అప్పటికి పూర్తయిన ఢీల్ నుండి నిర్మాత సురేష్ బాబు వెనక్కి రాలేదు. దీంతో సినిమా ఈనెల 20 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కావడం ఖరారు అయిపోయింది. అయితే ఈ సినిమా విడుదల తేదీని 20వ తారీకు పెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది.
మామూలుగా టాలీవుడ్ లో సినిమాలు ఎక్కువగా వీకెండ్స్ లో నే విడుదల అవుతాయి అంటే గురు శుక్ర శని వారాలలో ఏదో ఒక రోజున చూసుకుని నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేస్తారు. అంతకుముందు సినిమాను వీక్ డేస్ కాబట్టి రిలీజ్ చేయడానికి ఎక్కువగా సాహసం చేయరు. అయితే ఈ సినిమా మాత్రం మంగళవారం రోజున రిలీజ్ కాబోతోంది. అయితే దానికి ముఖ్య కారణముందట. 23 వ తారీఖున సినిమాలు విడుదల చేయడానికి థియేటర్ల యాజమాన్యాలు సన్నాహాలు చేస్తుండగా ఈ సినిమా కూడా అదే రోజు విడుదల చేస్తే స్ట్రీమింగ్ తగ్గుతుంది అన్న భయంతోనే ముందుగానే విడుదల ఖరారు చేశారట. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లను కాదని ఓ టీ టీ లలో సినిమాను విడుదల చేస్తున్నాం. వారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదనే సురేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారట.