విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'నారప్ప'సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చేసింది.గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న దాని ప్రకారమే.. ఈ సినిమా ఓటీటీ లోనే విడుదల కానుంది దినికి సంబంధించి చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.ఈ నెల 20 న నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్నట్లు పస్వయంగా వెంకటేష్ తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ ట్వీట్ కూడా చేసాడు.అయితే ఈ సినిమా మొదట జూలై 23 లేదా 24 న వస్తుందని ప్రచారం జరిగింది.సాధారణంగా ఏ కొత్త సినిమా అయినా విడుదలయ్యేది శుక్రవారం రోజునే.ఓటీటీ లో విడుదల చేసినా.. థియేటర్లలో విడుదల చేసినా నిర్మాతలు శుక్రవారం సెంటిమెంట్ ని ఫాలో అవుతారు.

లేదంటే పండగలప్పుడు, కానీ ఇంకేమైనా విశేషమైన డేట్స్ కే సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు.రోజులు మారినా.. ఈ సెంటిమెంట్ ని మాత్రం మన నిర్మాతలు బ్రేక్ చేయలేదు.ప్రత్యేక సందర్భం అనేది లేకుంటే శుక్రవారమే కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి.కానీ 'నారప్ప' నిర్మాతలు ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు. నారప్ప సినిమాను మంగళవారం రోజున రిలీజ్ చేస్తున్నారు.ఇక పేరుకు మంగళవారమే అయినా.. ఎప్పటిలాగే అమెజాన్ ప్రైమ్ లో ముందు రోజు రాత్రి 10 గంటలకు సినిమా రిలీజ్ అవుతుందని అందరు అనుకుంటున్నారు.

అయితే శుక్రవారం సెంటిమెంట్ ను కాదని ఇలా ఎటూ కానీ రోజున 'నారప్ప' సినిమాను ఎందుకు రిలీజ్ చేస్తున్నారనేది అర్థం కావడం లేదు.బహుశా 23 న శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకుంటున్నాయి కాబట్టి..ఎగ్జిబీటర్ల నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటీటీ లో విడుదల అవుతున్న ఈ సినిమాను అదే రోజు ఓటీటీ లో విడుదల చేస్తే బాగుండదేమో అని నిర్మాత సురేష్ బాబు ముందే ఊహించి..ఈ సినిమాని ప్రైమ్ లోరిలీజ్ చేసి ఉండొచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.ఏదేమైనా ఈ శుక్రవారం సెంటిమెంట్ ను మొదటి సారి వెంకటేష్ నారప్ప సినిమా బ్రేక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: