తెలుగు సీనియర్ యాక్టర్ ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌గ‌తి సుదీర్ఘ కాలం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాణించి మంచి గుర్తింపు ద‌క్కించుకుంది.కొత్త తరం హీరోల‌కు మ‌ద‌ర్ గా ఇంకా సిస్ట‌ర్ గా ఆమె చాలా సినిమాలలో న‌టించింది. వ‌దిన‌..అత్త పాత్ర‌ల్లోనూ ప్రేక్ష‌కుల‌కు మెప్పించింది. తన వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లు పోషిస్తూ న‌ట‌న‌లో త‌నదైన‌ మార్క్ చూపిస్తుంది.ఇక ప్ర‌స్తుతం ప్రగతి వ‌య‌సు 45 సంవత్సరాలు.అంత వయసు వున్నా కాని తాను ఫిట్ గా ఉండేందుకు జిమ్ లో ఎంతగా శ్ర‌మిస్తున్నదో మనం ఎప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము. వ‌ర్క‌వుట్ల విష‌యంలో ఈ తరం ఫ్యాష‌నిస్టాల‌కు ఏమాత్రం తీసిపోన‌ని ప్రగతి నిరూపిస్తుంది. ఇక లాక్ డౌన్ స‌మ‌యంలో ప్ర‌గ‌తి జిమ్ లో నిరంత‌రం క‌స‌ర‌త్తులు చేసిన వీడియోల్ని షేర్ చేయ‌గా అవి అంత‌ర్జాలాన్ని బాగా షేక్ చేశాయి. చాలా మంది కూడా ప్రగతిని పోగొడుతూ మీరు చాలా సూపర్ అని పొగిడారు.

ఇక అప్పట్నుంచి ప్రగతి అస్సలు తగ్గట్లేదు. ప్రతిసారి చాలా కష్టపడుతూ నెటిజన్స్ మెప్పు కోసం చాలా ఓవర్ గా వర్కౌట్లు చేస్తుంది. ఏదైనా కాని ఒక లిమిట్ వరకు చేస్తే నెటిజన్స్ మెచ్చుకుంటారు. కాని ఒకసారి మెచ్చుకుంటున్నారని వారి మెప్పు కోసం పదే పదే వర్కౌట్లు చేస్తే ఏమవుతుంది. ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఇప్పుడు ప్రగతి చేసే ఓవర్ వర్కౌట్ల వల్ల నెటిజన్స్ నుంచి ట్రోల్స్ ఎదురుకుంటుంది.పావలా చెయ్యమంటే పది రూపాయలు చేస్తుంది. మరి ఇంత ఓవర్ గా వర్కౌట్లు చెయ్యడం అవసరమా అంటూ నెటిజన్స్ ప్రగతిని తెగ ట్రోల్ చేస్తున్నారు.ఫిట్ గా ఆరోగ్యంగా ఉండటం మంచిదే. కాని అదేదో పెద్ద యుద్ధం లాగా ఘన కార్యం లాగా రోజు మాకు చూపించాల్సిన అవసరం లేదు అని కొందరు ట్రోల్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం ఆంటీ ఈ ఏజ్ లో మీకు ఈ ఓవర్ వర్కౌట్లు ఏంటి అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇప్పటికైన ప్రగతి తన ఓవర్ వర్కౌట్లు తగ్గిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: