దేవయాని.. ఈమె పేరు వినగానే ముందుగా సుస్వాగతం సినిమా గుర్తొస్తుంది. సుస్వాగతం సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దేవయాని. ఇక అక్కడ తండ్రికి భయపడతూ.. ప్రేమించిన ప్రియుడిని కాదనలేక  ఇబ్బందులు ఎదుర్కొనే పాత్రలో చక్కగా నటించి, అందరి చేత మంచి మన్ననలు పొందడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది దేవయాని. దేవయాని మహారాష్ట్రకు చెందిన నటి. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళం ,మలయాళం, కన్నడ, బెంగాలి ,హిందీ వంటి పలు  భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1996లో వచ్చిన " కాదల్ కొట్టై" సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న ఈమె, తమిళనాడు రాష్ట్రం నుంచి రాష్ట్ర చలన చిత్ర పురస్కారాన్ని కూడా అందుకుంది. అంతేకాదు ఉత్తమనటిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకోవడం విశేషం. ఇక ఈమె టీవీ సీరియల్స్ లో కూడా నటించి, అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక  35 చిత్రాలకుపైగా హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న దేవయాని, ఆ తర్వాత తల్లి పాత్ర , అక్క పాత్ర , వదిన పాత్రలో నటించి అలరించింది.ఇక ముఖ్యంగా మహేష్ బాబు నటించిన నాని సినిమాలో , సూపర్ స్టార్ మహేష్ బాబుకి తల్లి పాత్రలో, నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది దేవయాని. ఇక అంతే కాదు శ్రీమతి వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, జనతా గ్యారేజ్,  ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె , ఇటీవల సాయి పల్లవి హీరోయిన్ గా , నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో కూడా నటించింది.ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.. అదేమిటంటే, ఈమె రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏమిటి..?అని.. దేవయాని ప్రముఖ దర్శకుడు రాజ్ కుమారన్ ను ప్రేమించింది. కొన్ని సంవత్సరాల పాటు ప్రేమాయణంలో ఉన్న వీరిద్దరూ.. పెళ్లి చేసుకోవాలని ,ఇరువురి తల్లిదండ్రులను ఆశ్రయించగా.. ఇరు కుటుంబాల పెద్దలు, వీరి పెళ్ళికి ఒప్పుకోలేదు. అందుకే వీరిద్దరూ పారిపోయి, 2001వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం వీరికి ఇనియా, ప్రియాంక అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: