
అలనాటి నటి మీనా అందరికీ సుపరిచితమే. ఇప్పటికీ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. బాలనటిగా చిత్రసీమకు పరిచయమైన ఈ హీరోయిన్ బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని వందలాది ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఆ తరువాత హీరోయిన్ గా అరంగేట్రం చేసి కొన్ని సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. తమిళ సినిమా పరిశ్రమ నుంచి సినిమాల్లోకి పరిచయమైన ఆమె తెలుగులో కూడా అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ప్రస్తుతం దృశ్యం 2 తెలుగు రీమేక్ లో ఆమె హీరోయిన్ గా నటిస్తుండగా దృశ్యం మొదటి భాగంలో కూడా ఈమె నటించడం విశేషం. మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో తెలుగులో కూడా ఈ సినిమాని అనువదిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా త్వరలోనే విడుదల కాబోతోంది. అంతేకాకుండా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లూసిఫర్ రీమేక్ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది.
సీతారామయ్యగారి మనవరాలు చంటి వంటి మంచి మంచి చిత్రాలతో నటించి ఎక్స్ పోజింగ్ పాత్రలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ ఓరియంటెడ్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇకపోతే సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో విద్యాసాగర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమె భర్త విద్యాసాగర్ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ ఓ పాప కూడా ఉంది. ఆయన జీవితం లక్షల్లో ఉండడంతో ఏడాదికి ఆయన సంపాదన కోట్లలో ఉంటుంది అని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రీ ఎంట్రీ లో దూసుకుపోతున్న మీనా భవిష్యత్ లో ఇంకెలాంటి సినిమాల్లో నటిస్తుందో అని ఎదురుచూస్తున్నారు ఆమె అభిమానులు.. మీనాకు సౌత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికి తెలిసిందే..