టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్ లు తమ తొలి సినిమాతోనే సత్తా చాటుకుని ఆ తర్వాత ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. హీరోలను గతంలో ఏ దర్శకుడు చూపని విధంగా చూపిస్తూ తన సత్తా చాటుతూ స్టార్ డైరెక్టర్ లు గా ఎదిగారు ఎంతో మంది దర్శకులు. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ దర్శకులకు టాలెంటెడ్ దర్శకులకు కొదవ లేకుండా పోయింది. తమ తమ ప్రతిభతో ప్రేక్షకులను హిట్ సినిమాలతో ఎంతగానో మెప్పిస్తున్నారు వీరు. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏం జరుగుతుందో అన్న సందేహం అందరిలో నెలకొంటుంది.

ఎందుకంటే స్టార్ హీరోలు అందరూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా అంటూ కొత్త కొత్త పోకడలకు పోతుంటే మన దర్శకులు మాత్రం హీరోలు దొరక్క ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దాంతో వారు సినిమా చేయాలన్న కోరికతో ఇతర భాషల హీరోలతో ముందుకు వెళుతుండటం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే టాలీవుడ్ టాప్ దర్శకుడు వంశీ పైడిపల్లి , శేఖర్ కమ్ముల, బోయపాటి శ్రీను లాంటి దర్శకులు అరవ హీరోలతో ముందుకు వెళుతున్నారు. మరి కొందరు దర్శకులు బాలీవుడ్ కి సైతం తరలిపోతున్నారు. 

అర్జున్ రెడ్డి తో సంచలన విజయాన్ని నమోదు చేసిన సందీప్ రెడ్డి వంగా ఇంతవరకు తెలుగులో సినిమా చేయలేదు బాలీవుడ్లో తన రెండో సినిమా చేస్తున్నాడు. అలాగే జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్లోనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు వీరి సరసన మరొక టాలెంటెడ్ దర్శకుడు కూడా బాలీవుడ్ లోనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఘాజి అంతరిక్షం వంటి సినిమాలతో మునుపెన్నడూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాని కాన్సెప్ట్ తో సినిమా చేసిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి బాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. అంతరిక్షం తర్వాత ఏ తెలుగు హీరో కూడా ఆయనకు అవకాశం ఇవ్వడానికి ముందుకు రాని నేపథ్యంలో ఆయన బాలీవుడ్ వెళ్లిన్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: