ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమయిన ప్రభాస్ మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా ప్రభాస్ హీరోగా నిలదొక్కుకోడానికి మంచు ఊతం ఇచ్చింది. తరువాత తీసిన రాఘవేంద్ర సినిమా కూడా నిరాశ పరిచింది. ప్రభాస్ ఏమాత్రం నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ తరువాత m. s రాజు దర్శకత్వంలో వచ్చిన వర్షం మూవీ మంచి విజయం సాధించింది. ఆ సినిమాతో ప్రభాస్ కు మాస్ ఇమేజ్ వచ్చింది. ఆ తరువాత కూడా ప్లాప్స్ పలుకరించిన కృష్ణవంశీతో చేసిన చక్రం మూవీ మంచి నటుడుగా గుర్తింపు తెచ్చిపెట్టింది.ఈ సినిమా బాగానే వున్న కమర్షియల్ గా నీలదొక్కుకోలేదు. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమా ఊహించని విజయం సాధించింది. ప్రభాస్ కు స్టార్ హీరో గా గుర్తుంపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ప్రభాస్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో ప్రభాస్ డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది.రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా మంచి విజయం సాధించిందిఛత్రపతి సినిమా తరువాత వచ్చిన సినిమాలు విజయం సాధించిన ఛత్రపతి స్థాయిని చేరుకోలేదు. ప్రభాస్, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమా ఘనవిజయం సాధించింది అప్పటి వరకు వున్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది. ఈ సినిమాతో పీభాస్ రేంజ్ బాగా పెరిగింది.ఆ తరువాత ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో రెండవ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నిడివి ఎక్కువ కావటంతో రెండు భాగాలుగా తెరకెక్కింది. బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయింది. నిర్మాతలకు కొన్ని కోట్లరూపాయలు వచ్చేలా చేసింది.ఛత్రపతి సినిమాతో స్టార్ హీరో అయిన ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూ లో రాజమౌళి ప్రభాస్ రెమ్యూనరేషన్ గురించి చెప్పాడు. ఒక రోజు ప్రభాస్ రాజమౌళికి కాల్ చేసి ఏంటి డార్లింగ్ రెమ్యూనరేషన్ ఇంకా ఎక్కువ ఇస్తాము అని చెప్తున్నారు అని చెప్పాడు. రాజమౌళి దానికి సమాధానంగా వాళ్ళే ఇష్టమంటున్నారు గా తీసుకోమని చెప్పారట. అప్పుడు ప్రభాస్ అది కాదు డార్లింగ్ ఇప్పటికే ఈ సినిమా కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టారు కదా అని సమాధానమిచ్చాడటా. ఈ సంభాషణ అంత బాహుబలి సినిమా ఇంకా విడుదల కాకముందు జరిగిందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి