ఇక మరో వైపు చిరు అప్ కమింగ్ మూవీ ఇదే నంటూ వార్త వైరల్ గా మారింది. చిరు నుండి వచ్చిన మాస్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని పూరి తెరకెక్కించనున్నాడని చిత్రపురి టాక్. ప్రస్తుతానికి చిరు బిజీగా ఉన్నప్పటికీ, కథను వినిపించేశారట. కథ నచ్చడంతో చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని భోగట్టా. దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. ఇందులో చిరుకి జోడీగా సీనియర్ హీరోయిన్ లను సంప్రదిస్తున్నారట ? ఈ కొత్త చిత్రంలో చిరు పక్కన బాలీవుడ్ నుండి ప్రముఖ నటుడు నైటిన్చానున్నారని సమాచారం. ఇలా ఇది పాన్ ఇండియా మూవీగా మారబోతోంది.
మొదట ఆ బాలీవుడ్ నటుడు ఈ టాలీవుడ్ సినిమా చేయడానికి నిరాకరించారట, అయితే మెగాస్టార్ చిత్రం అని చెప్పడంతో వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమా జరిగితే చిరు కెరీర్ లో మరో అస్సెట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే..