టాలీవుడ్ సినీ పరిశ్రమ ఎంతో గొప్పగా చెప్పుకునే నిర్మాత మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడు. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను వందలకొలది టాలీవుడ్ సినీ పరిశ్రమకు తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత ఆయనది. సొంత కొడుకు లను సైతం సినిమా రంగంలో ఉంచి విశేష సేవలందిస్తూ ప్రస్తుతం స్వర్గస్తులయ్యారు డాక్టర్ డి.రామానాయుడు. ఆయన తరువాత తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ పేరుకు తగ్గట్టుగా ఈ ఇద్దరు తనయులు టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. రామానాయుడు అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది రామానాయుడు స్టూడియో.

ఈ స్టూడియో నిర్మించడానికి ఆయన ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది అంటే అందరూ నమ్మాల్సిందే. మద్రాస్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి సినిమా పరిశ్రమ తరలివస్తున్న రోజులవి.  హైదరాబాదులో స్టూడియో కట్టుకునేందుకు అక్కినేని నాగేశ్వరరావు కు జలగం వెంగళరావు ప్రభుత్వం బంజారా హిల్స్ లో స్థలం కేటాయించింది. అదే సమయంలో సురేష్ మూవీస్ అదినేత రామానాయుడు కి కూడా స్థలం కావాలా అని అడిగాడు అప్పటి ముఖ్యమంత్రి. అయితే తనకు హైదరాబాద్ వచ్చే ఆలోచన లేకపోవడంతో వద్దని చెప్పాడు.

విజయ ప్రొడక్షన్స్ అధినేత లో ఒకరైన నాగిరెడ్డి పిల్లలతో రామానాయుడు కలిసి ఉండేవారు అందుకే వాహినీ స్టూడియో తనదిగా భావించాడు. అందులోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. అదే సమయంలో అన్నపూర్ణ స్టూడియోలో రామానాయుడు కు సంబంధించిన ఓ సినిమా షూటింగ్ జరిగింది. అప్పుడు ఆ సినిమా ప్రారంభానికి వచ్చిన నాగిరెడ్డి ఈ కొండల్లో స్టూడియో పెడితే బాగుంటుంది అని చెప్పగా ఆయనకు స్టూడియో గురించిన ఆలోచన వచ్చింది.  అప్పుడు సీఎంగా ఉన్న వెంకట్ రామ్ రామానాయుడు కు ఫిలిం నగర్ లో ఉన్న స్థలం కేటాయించారు. ఓసారి ఎన్.టి.రామారావు ఈ స్థలం ఈ రాళ్ళలో ఏం స్టూడియో కడతావు అని చెప్పగా రామానాయుడు ఆ ప్రాంతంలో రాళ్లను పగలగొట్టించి ఆరు నెలల్లో ఎంతో ఖర్చు పెట్టి మరి ఈ స్టూడియో నిర్మాణాన్ని పూర్తి చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: