హాట్ బ్యూటీ నభా నటేష్ కన్నడ సినిమా అయినా 'వజ్రకాయ' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు హీరోగా నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన 'డిస్కో రాజా' సినిమాలోనూ హీరోయిన్ గా మెరిసింది. ఈ సినిమాల ద్వారా ఈ హీరోయిన్ కి పెద్దగా గుర్తింపు తగ్గలేదు. ఆ సమయంలోనే రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సంవత్సరంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన 'అల్లుడు అదుర్స్' అనే సినిమాతో జనాలను పలకరించింది. ఇలా టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి  బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.


అది కూడా బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన హృతిక్ రోషన్ తో కలిసి నటించే అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అవకాశం సినిమాల్లో కాదు అని హృతిక్ రోషన్ నటిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. జాన్ లే కర్రీ రాసిన పుస్తకం ఆధారంగా సూపర్ హిట్ అయినా గూడచారి థ్రిల్లర్ 'ది నైట్ మేనేజర్' అనే వెబ్ సిరీస్ ని బాలీవుడ్ లోకి రీమేక్ గా చేస్తున్నారు. దీనితో డిజిటల్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్న హృతిక్ రోషన్. ఈ సిరీస్ కోసం నభా నటేష్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే .ప్రస్తుతం హృతిక్ 'ఫైటర్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: