తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాలసుబ్రమణ్యం ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. తన గాత్రంతో నటనతో స్వరంతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. బాలు వారసుడిగా ఆయన తనయుడు ఎస్పీ చరణ్
సినిమా రంగంలోకి గాయకుడిగా ప్రవేశించి తన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. గాన గంధర్వుడి ఒడిలో పెరిగిన తను మాత్రం గాయకుడు అనుకోవాలి అనుకోలేదు అని చాలా సార్లు చెప్పాడు చరణ్. అనుకోకుండానే గాయకుడు అయినా బాలు గారిలా పాటలు పాడి శభాష్ అనిపించుకున్నాడు.
నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేసి మంచి పేరును అందుకున్నాడు కాకపోతే ఆ సినిమాలకు డబ్బులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇదే సమయంలో
తండ్రి హఠాత్ మరణం నుంచి కోలుకోలేక పోయాడు చరణ్. ప్రస్తుతం ఆ బాధ నుంచి కోలుకుంటూ పాడుతా తీయగా కార్యక్రమం తో సరికొత్తగా ముందుకు రాబోతున్నాడు చరణ్. అయితే కొడుకు వల్ల బాలు గారు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది ఆయనను పూర్తిగా దివాళా తీయించాడు అనే విమర్శల నుంచి సంగీతం రాకపోయిన వాళ్ళ
నాన్న లాగానే బాగా పాడుతున్నాడు మాట పాట వరకు అచ్చం వాళ్ళ
నాన్న లానే అనిపించుకునే లా ఇప్పటి వరకు ఆయన ప్రయాణం కొనసాగింది.
అన్నింటికీ చిరు నవ్వుల సమాధానం గా మార్చుకున్నారు చరణ్. దానికి ఒక విధంగా
నాన్న ఇచ్చిన ధైర్యం కారణమని ఆయన పలుమార్లు చెప్పారు.
అమెరికా లో ఉన్నప్పుడు ఇంటికి దూరంగా ఉండటం కష్టంగా అనిపించేది. అక్కడ ఎనిమిది సంవత్సరాల పాటు ఫిలిం
టెలివిజన్ కు సంబంధించిన కోర్సు చేసి చదువు పూర్తయ్యాక సినిమారంగంలో పూర్తిగా స్థిరపడాలని నిర్ణయించుకొని ప్రొడక్షన్ కంపెనీ పెట్టాను. ఓసారి
ఇళయరాజా గారు పాట పాడు తావా అంటే లేదని ఎంత చెప్పినా కూడా ప్రయత్నించు అంటూనే అప్పటికప్పుడు నా చేత కొన్ని లైన్లు పాడించారు. అది విడుదల కాలేదు కానీ తర్వాత ఆయనే
కన్నడ సినిమాల్లో పాడించారు. దాంతో బాలు గారి అబ్బాయి పాడుతున్నాడట అనే ప్రచారం మొదలైంది.