
అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి వచ్చి నాగార్జున ప్రస్తుతం సీనియర్ హీరోల్లో టాప్ హీరో గా కొనసాగుతున్నాడు. తాను హీరోగా ఉన్న సమయంలో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి హీరోలకు మంచి పోటీని ఇస్తూ టాలీవుడ్ లో పెద్ద హీరోగా ఎదిగాడు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ఈ నలుగురు సీనియర్ హీరోలు యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా వరుస సినిమాలు చేస్తూ ఒకేసారి నాలుగైదు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకులను వరుస సినిమాలతో ఆలోచింపచేస్తున్న వీరు భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేసే విధంగా దూసుకుపోతున్నారు.
అక్కినేని నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అంతకు ముందు వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న నాగార్జున కు ఈ సినిమా ఉపశమనం అందించింది. ఈ సినిమా ఇచ్చిన హిట్ జోష్ లోనే నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాను మొదలు పెట్టాడు. నాగార్జున కెరియర్లోనే వెరైటీ సినిమా గా రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గరుడవేగ సినిమా తో ఫుల్ ఫామ్ లో ఉన్న ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను కూడా అదే రేంజ్ లో మరొక క్రియేటివిటీ ఉన్న సినిమానీ చేయబోతున్నారు.
ఈ సినిమాలే కాకుండా మరొక రెండు సినిమాలను ఒక వెబ్ సిరీస్ ను కూడా చేసే ఆలోచనలో నాగార్జున ఉన్నాడట. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలను గమనిస్తే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కాకుండా ఓ రెండు రీమేక్ సినిమాలు, ఓ స్ట్రయిట్ తెలుగు కథ ఉన్న సినిమా చేయబోతున్నారు. బాలకృష్ణ కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మసాలా చిత్రం, మరో ఇద్దరు మాస్ దర్శకులతో సినిమాలు చేయనున్నాడు. వీరి బాటలోనే నాగార్జున కూడా వరుస సినిమాలు చేస్తుండడం అక్కినేని అభిమానులను ఎంతగానో సంతోషపరుస్తుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు అనే సినిమాను త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడట. అంతే కాకుండా ఓ వెబ్ సిరీస్ ను కూడా నాగార్జున ఒప్పుకున్నాడని తెలుస్తోంది.