
ఇక తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటూ గొప్ప నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్నాడు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలని ఎంతో మంది హీరోయిన్లు కోరుకుంటారు. కేవలం నేటి యువ హీరోయిన్లకు మాత్రమే కాదు నాడు హీరోయిన్లుగా నటించిన ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వారు సైతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో కనిపించాలని ఎంతగానో ఆశపడుతుంటారు. ఇలాంటి హీరోయిన్లలో ఒకరు దేవి సినిమా ఫేమ్ వనిత. ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తన మనసులో మాట చెప్పేసింది
దేవి సినిమాలో హీరోయిన్ గా తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది వనిత. కానీ ఆ తర్వాత మాత్రం ఎందుకో తెలుగు సినిమాలకు దూరం అయింది. అయితే దేవి సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించేందుకు అవకాశం వచ్చినప్పటికీ తన బుర్ర సరిగా పనిచేయలేదని అందుకే వేరే సినిమాలు ఒప్పుకోలేదు అంటూ చెప్పింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో నాగార్జున గారు అంటే ఎంతో ఇష్టం.. ఇక ఇప్పుడు యువ హీరోలలో ఎన్టీఆర్ అంటే పిచ్చి అంటూ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ సినిమాలో ఒక్క సీన్ లో కనిపించిన చాలు అని ఆశ పడుతూ ఉంటాను. ఎన్టీఆర్ సినిమాల్లో కనిపిస్తే అది ఈ జన్మకు చాలు అంటూ తన మనసులో మాట బయట పెట్టింది వనిత.