పవన్
కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఆ రోజును
పండుగ ఎలా జరుపుకుంటారు. అందరు హీరోల అభిమానులు పవన్
కళ్యాణ్ సినిమా ను జాతర లా చేసుకుంటారు. రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత ఆయన ఇమేజ్ కొంత తగ్గింది అన్న వార్తలు రాగా అది ఏమాత్రం నిజం కాదు అని ప్రేక్షకులు వకీల్ సాబ్
సినిమా సమయంలో చేసిన సందడి తో రుజువు చేశారు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా కొంత కూడా ఇమేజ్ తగ్గకుండా తన వ్యక్తిత్వం తోనే ప్రేక్షకులను అలరిస్తూ మ్యానరిజం తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
ఆయన నటించిన తొలి చిత్రం నుంచి ఇప్పటివరకు పవన్ అభిమానిగా మారిన వారు ఎవరి లో కూడా మార్పు రాలేదు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ లాగానే పవన్ కు వీర భక్తులు ఉన్నారు. ప్రజల్లో మాత్రమే కాదు సెలబ్రిటీలలో సైతం పవన్
కళ్యాణ్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనేక సినిమాలలో పవన్ ఇమేజ్ ను వాడుకున కుర్రహీరోలు తాము కూడా పాపులారిటీ తెచ్చుకునే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్కళ్యాణ్ భీమ్లా
నాయక్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల
యూట్యూబ్ లో విడుదల కాగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్న
రానా ను ఎందుకు చూపించలేదని విమర్శలు కూడా బాగా వచ్చాయి. పవన్
కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఒక్క పవన్
కళ్యాణ్ ను మాత్రమే చూపించి ఆయనకు చెడ్డ పేరు తీసుకువస్తారా అని ఎన్నో విమర్శలు వారు సైతం చేశారు దానికి తగ్గట్లుగానే ఫస్ట్ గ్లింప్స్ పై కూడా పెద్దగా క్రియేట్ కాకపోవడం పవన్
కళ్యాణ్ అభిమానులను తొలిచి వేస్తుంది.