ఈ క్రమంలోనే హీరో నిఖిల్ తో నటించినటువంటి స్వామి రా.. రా మరియు కార్తికేయ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది.ఈ విధంగా సినిమా పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి 2018లో సినిమాలకు దూరం అయ్యింది. ఈ క్రమంలోనే ఫైలెట్ అయిన వికాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారని సమాచారం. ఈ విధంగా పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంలో స్థిరపడిన కలర్స్ స్వాతి పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిందట.అయితే తాజాగా ఈ నటి తన రెండవ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టినట్టు సమాచారం.
ప్రస్తుతం కలర్స్ స్వాతి 3 సినిమా అవకాశాలను దక్కించుకుని తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం.పంచతంత్రం అనే సినిమా ద్వారా తన రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కలర్ స్వాతి ఆ తర్వాత రెండు సినిమా అవకాశాలను దక్కించుకున్నారని వార్త వినిపిస్తుంది.మొత్తానికి అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకొని ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ,అటు వైవాహిక జీవితంలోనూ ఎంతో సంతోషంగా గడుపుతుందని తెలుస్తుంది.మళ్ళీ సినిమాలలో బిజీగా అవుతుందో లేదో చూడాలి మరి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి