టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక ఫ్లాప్ ఎదురైతే ఆ దర్శకుడి ని హీరోలు సైతం పక్కనపెట్టి హిట్ ట్రాక్ లో ఉన్న దర్శకులతో మాత్రమే పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. గతంలో వారు ఎన్ని హిట్ సినిమాలు చేసినా ఒక ఫ్లాప్ సినిమా వారి కెరీర్ ను మొత్తం మార్చేస్తుంది. ఆ విధంగా వరుస ప్లాప్ సినిమాలతో ఫ్లాప్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుని తెలుగు ప్రేక్షకులలో బ్యాడ్ నేమ్ సంపాదించుకున్నాడు మెహర్ రమేష్. దర్శకుడిగా టాలీవుడ్ లో కంత్రి సినిమాతో పరిచయమై తొలి సినిమాతోనే భారీ ఫ్లాప్ అందుకున్నాడు.

ఆ తర్వాత అదే ఎన్టీఆర్ తో మరొకసారి సినిమా చేసి శక్తితో భారీ రేంజ్ లోనే ఫ్లాప్ చవి చూశాడు. దీంతో దర్శకుడు మెహర్ రమేష్ ఫ్లాప్ చిత్రాల దర్శకుడి గా పేరు పొందాడు. ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన బిల్లా సినిమా పర్వాలేదనిపించినా వెంకటేష్ హీరోగా చేసిన షాడో సినిమా మాత్రం అత్యంత దారుణంగా ఫ్లాప్ అయ్యింది. దాంతో దర్శకుడిగా మరో చిత్రం చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఆయనకు.  ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో బోళా శంకర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 మెహర్ రమేష్ తొలుత చిరంజీవి తో సినిమా అనగానే మెగా అభిమానుల తో పాటు సినిమా వారు సైతం ఎంతో ఆశ్చర్యపోయారు. ఏం చూసి మెహర్ రమేష్ కు సినిమా అవకాశం ఇచ్చారు అని ప్రశ్నించారు. కానీ చిరంజీవి మెహర్ రమేష్ ను నమ్మి ఈ అవకాశం ఇవ్వగా బోళా శంకర్ సినిమా తో హిట్ కొట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తో పాటు మళ్లీ ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. రమేష్ లో రచయితను పక్కకు పెట్టి డైరెక్టర్ గా చూస్తే తప్పకుండా అతను అందరికీ నచ్చుతాడని, చిరు కూడా అదే యాంగిల్ మెహర్ ను చూశాడని అంటున్నారు. ఇక ఆయన చేసిన సినిమాల్లో డైరెక్షన్ విలువలు చాలా బాగున్నాయి అని కొంత మంది సినీ విశ్లేషకులు మెహర్ రమేష్ లోని పాజిటివ్ పాయింట్స్ చెప్పడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: