టాలీవుడ్
సినిమా పరిశ్రమలో నిర్మల్
హీరోయిన్ గా వచ్చి ఇప్పుడు స్టార్
హీరోయిన్ అవడానికి పరుగులు పెడుతున్న కథానాయిక నాభ నటేష్. ఇస్మార్ట్ శంకర్
సినిమా ఒక్కసారిగా తన క్రేజ్ ను పెంచేసింది. పాపులారిటీ కూడా బాగా పెరిగిపోయింది.
టాలీవుడ్ లో టాప్
హీరోయిన్ గా చేసిన ప్రతి
సినిమా సూపర్ హిట్ కావడంతో అందరి కళ్ళు అమేపైనే ఉన్నాయి. ప్రస్తుతం
బాలీవుడ్ బ్లాక్ బస్టర్
మూవీ అందాధున్ తెలుగు రీమేక్ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తుంది నాభ.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో
తమన్నా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది.ఈ చిత్రం ప్రముఖ ఓ టీ టీ సంస్థ హాట్ స్టార్ లో
సెప్టెంబర్ 17న విడుదల కానుంది.
మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ
సినిమా కి నితిన్
తండ్రి సుధాకర్
రెడ్డి సోదరి నిఖితారెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసిన యూనిట్ అందరి ఇంటర్వ్యూలను చేస్తూ సినిమాపై బజ్ పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తుంది.
ఈ నేపథ్యంలోనే
హీరోయిన్ నాభ కూడా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించగా ఈ
సినిమా విశేషాలతో పాటు తన కెరీర్ సంగతులపై కూడా కూడా ఓపెన్ అయింది. ఈ చిత్రంలో అవకాశం రావడం గొప్ప గా ఫీల్ అవుతున్నాను అని ఆమె చెప్పింది. ఈ కథాంశాన్ని తెలుగు ప్రేక్షకులు తప్పకుండా అలరిస్తారు అని మాతృక లో
రాధిక ఆప్ట్ చేసిన పాత్ర చేయడం తనకు సంతోషంగా ఉంది అన్నారు. అంతేకాకుండా మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో
హీరోయిన్ గా ఎంపిక అయ్యారు అనే విషయంపై ఆమె నోరు విప్పింది. ఈ విషయం అధికారికంగా వారు చెప్తేనే బాగుంటుందని ఆమె సమాధానం ఇచ్చింది. దీంతో నాభ అభిమానులు తమ అభిమాన నటి పెద్ద సినిమాల్లో నటిస్తుందని సంతోషంలో మునిగితేలుతున్నారు .