బండ్ల గణేష్ అంటే మనకు స్టేజీల మీద మాస్ స్పీచ్ లు ఇచ్చినవే గుర్తొస్తాయి కానీ ఆయన కమెడియన్ గా చేసిన సినిమాలు ఎవరికి గుర్తురావు. అయితే బండ్ల గణేష్ లో చాలమంచి నటుడు ఉన్నాడు అని ఆయన పాత సినిమాలు చూస్తే అర్థం అవుతుంది. అయితే తీన్మార్ సినిమాతో నిర్మాతగా అడుగుపెట్టి గబ్బర్ సింగ్ తో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన బండ్లన్న ఇప్పుడు కొత్తగా హీరోగా మరబోతున్నాడు.
 డేగల బాబ్జి పేరుతో ఆయన తీసిన సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఒత్త సేరుప్పు సైజ్ 7 సినిమా రీమేక్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ కూడా రావడం విశేషం. అయితే ఈ సినిమా అంతా ఒకటే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రని తమిళంలో పార్థివన్ అద్భుతంగా చేసాడు. ఇక తెలుగులో  బండ్ల గణేష్  ఎలా చేస్తాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. కొత్త డైరెక్టర్ వెంకట్ చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతి చంద్ర నిర్మాణంలో ఈ డేగల బాబ్జి త్వరలోనే విడుదల కాబోతుంది.అయితే అప్పుడప్పుడు సినిమాల్లో కామెడీ పాత్రలు చేసే బండ్ల గణేష్ ఇప్పుడు హీరోగా మారి సినిమా చేయడం అందులో ఆయన ఒక్క పాత్రనే ఉండటం చాలా విచిత్రంగా ఉంది.

ఇలాంటి ప్రయోగాత్మగా సినిమాని థియేటర్స్ లో విడుదల చేస్తారా లేక ఓటిటి లోకి వస్తుందా అనేది ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిన విషయం.ఇక ప్రస్తుతం బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ తో ఇంకొక సినిమాని చేయబోతున్నారు. ఆ సినిమాకి డైరెక్టర్ ఇంకా కాంఫైర్మ్ కాలేదు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలుకాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: