ఇక ఈ రెండు సినిమాల తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సినిమా లో కూడా నటించనున్నారు పవర్ స్టార్. అయితే వీటిలో భీమ్లా నాయక్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా, ఇప్పటివరకు కొంత మేర షూట్ జరుపుకున్న హరిహరవీరమల్లు మూవీ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ఆరంభం కానునంట్లు సమాచారం. కాగా భీమ్లా నాయక్ ని యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తీస్తుండగా పీరియాడిక్ డ్రామా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీని క్రిష్ జాగర్లమూడి తీస్తున్నారు. అయితే త్వరలో హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ మూవీ ని కూడా పట్టాలెక్కించనున్న పవన్ కళ్యాణ్, వచ్చే ఏడాది జనవరిలో సురేందర్ రెడ్డి మూవీ కూడా మొదలెట్టనున్నారట.
కాగా హరీష్ శంకర్ మూవీని మైత్రి మూవీ మేకర్ వారు అలానే సురేందర్ రెడ్డి మూవీని ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించనున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి తీయనున్న మూవీ, భారీ స్థాయి యాక్షన్ తో సాగే స్టైలిష్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని, కాగా ఈ మూవీ లో విలన్ గా ప్రముఖ నటుడు సోను సూద్ ఎంపికయ్యారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే సోను సూద్ ని కలిసి కథ, కథనాలు వినిపించి ఆయన నుండి కాల్షీట్స్ కూడా తీసుకున్నారట దర్శకనిర్మాతలు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై ఆ మూవీ యూనిట్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి