టాలీవుడ్
సినిమా పరిశ్రమలో కొంత మంది
హీరోయిన్ లు ఎలాంటి గ్లామర్ ప్రదర్శించకుండా నే ప్రేక్షకులను ఇట్టే మెప్పింప చేస్తూ ఉంటారు. తమ సహజమైన నటనతో సహజమైన అందాలతో వారిని ఆకట్టుకుని వారు మంచి డిమాండ్ ను ఏర్పరుచుకుంటారు. ఆ విధంగా తెలుగు సినిమాలలో మంచి అవకాశాలను అందుకుంటూ స్టార్
హీరోయిన్ రేంజ్ కు దూసుకుపోతుంది
ఐశ్వర్య రాజేష్. ఆమె
కౌసల్య కృష్ణమూర్తి
సినిమా తో తెలుగులో ఎంట్రీ చేసి ఆ సినిమాలో తన సహజమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఓ క్రికెటర్ కావాలనుకునే
అమ్మాయి పాత్రలో ఆమె ఎంతో సహజ రీతిలో నటించి ఎవరి పిల్ల అనిపించుకుంది. అలనాటి నటుడు రాజేష్ కూతురిగా
సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఈమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ సహజమైన పాత్ర లు చేస్తూ భారీ ప్రేక్షకాభిమానాన్ని అందుకుంది. తాజాగా అదే రీతిలో ఆమె రిపబ్లిక్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ పాత్ర ఈ సినిమాలో అత్యంత కీలకం గా ఉండే పాత్ర కాగా మొదట్లో సాయి ధరంతేజ్ పక్కన
హీరోయిన్ గా ఈమె ఏంటి అన్న కొన్ని విమర్శలు వచ్చాయి
వాటికి సమాధానం చెబుతూ ఈ సినిమాలో నటించి ఏ
హీరోయిన్ కి రాని పేరు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలు ఎక్స్పోజింగ్ పాత్రలు చేస్తూ
సినిమా అవకాశాలను కొట్టేస్తున్న వారికి ఈమె ఇలా కూడా
సినిమా అవకాశాలను సంపాదించవచ్చు అని చాటి చెప్పింది. రిపబ్లిక్ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నిన్న విడుదలైన ఈ సినిమాకు
దేవా కట్టా దర్శకత్వం వహించగా ఈ
సినిమా ప్రమోషన్ సమయంలో కళ్ళతోనే
ఐశ్వర్య రాజేష్ నటించి చూపు తిప్పుకోనివ్వని లేదు అని కామెంట్ చేశాడు. ప్రేక్షకులు కూడా ఆయన లాగానే
ఐశ్వర్య రాజేష్ ఉన్నప్పుడు తమ చూపు తిప్పుకోలేక పోయాను అంత సహజంగా ఆమె నటించి మమ్మల్ని మెప్పించింది అని చెబుతున్నారు. ఈ
సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే ఓ మంచి సినిమాగా ఉంది.