అక్కినేని హీరో అఖిల్ కోసం ఓ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నారు.ఇటీవల అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో టీమ్ ని అభినందించడానికి ఆ స్టార్ హీరో స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు.ఇంతకీ ఎవరా హీరో? అనే వివరాల్లోకి వెళితే..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అక్టోబర్ 15 దసరా కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ ని అందుకొని.. డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు,వాసు వర్మ ఈ సినిమాని నిర్మించగా..అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు.

అయితే విడుదలైన మొదట ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా.. ఆ తర్వాత మెల్లగా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ ని అందుకున్నట్లు నిర్మాతలు తెలిపారు.రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పండగ సీజన్ ని క్యాష్ చేసుకొని  భారీకలెక్షన్స్ దిశగా దూసుకుపోతోందని నిర్మాతలు వెల్లడించారు.దీంతో ఈ సినిమా ప్రమోషన్ నమరింతగా పెంచి .ఇటీవల వైజాగ్ లో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేయగా,దానికి మంచి స్పందన లభించింది.ఇక ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ నెల 19 న హైదరాబాద్ లో మరో సక్సెస్ మీట్ ను నిర్వహించబోతున్నారు.

ఇక ఈ సక్సెస్ మీట్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం స్వయంగా ప్రకటించారు.ఇక జీఏ2 బ్యానర్ కి బన్నీ ఎల్లప్పుడూ తన సపోర్ట్ ని అందిస్తూ వస్తున్నాడు.పైగా బన్నీ వాసు, వాసు వర్మ లు ఆయనకి మంచి స్నేహితులు కూడా. ఈ నేపథ్యంలోనే బన్నీసక్సెస్ ఈవెంట్ రాబోతున్నాడు. దీంతో ఈ సక్సెస్ ఈవెంట్ కోసం బన్నీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఇదిలా ఉంటె మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అఖిల్, పూజ హెగ్డే లతో పాటు మురళి శర్మ, ఆమని,జయ ప్రకాష్,సుడిగాలి  సుధీర్,గెటప్ శీను,ప్రగతి తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. గోపి సుందర్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: