రోజురోజుకీ మరింత రసవత్తరంగా మారిపోతుంది బిగ్బాస్ కార్యక్రమం. ఇప్పటికే బుల్లితెరపై టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న రియాలిటీ షో గా కొనసాగుతోంది. దాదాపుగా బుల్లితెర ప్రేక్షకులందరికీ కన్ను బిగ్బాస్ హౌస్ పై ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి రోజు కూడా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నారు ప్రస్తుతం తెలుగు బుల్లితెర ప్రేక్షకులు. ఎందుకంటే గత సీజన్ లతో పోల్చి చూస్తే ఈ సీజన్ మరింత రసవత్తరంగా మరింత కాంట్రవర్షియల్ గా మారిపోయింది అని చెప్పాలి. హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య  గొడవలు ఒక రేంజ్ లో ఉంటున్నాయ్. అయితే గత సీజన్ లో కంటెస్టెంట్స్ ఎప్పుడూ కూడా పరుష పదజాలాన్ని వాడలేదు. కానీ ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లో మాత్రం కంటస్టెంట్స్ మధ్య గొడవలు జరిగినప్పుడు ఏకంగా ప్రత్యక్షంగా తిట్టడం.. పరుష పదజాలం వాడటం కూడా జరుగుతుంది. దీంతో బిగ్ బాస్ షో కాస్త బుల్లితెర ప్రేక్షకులందరికీ తెగ ఆకర్షిస్తుంది. సినీ సెలబ్రిటీల మధ్య జరుగుతున్న గొడవలు బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి అని చెప్పాలి. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ప్రియా సన్నీ ని నామినేట్ చేస్తూ సిల్లీ రీజన్ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత కూడా బిగ్ బాస్ టాస్క్ ఇస్తే అటు ప్రియా మాత్రం సన్నీ ని టార్గెట్ చేస్తూ టాస్క్ ఆడుతూ ఉండటం తో బిగ్ బాస్ హౌస్ వాడివేడిగా మారిపోయింది. సాధారణంగానే అగ్రెసివ్ గా ఉండే సన్నీ ఇక తాను సంపాదించుకున్న గుడ్లు మొత్తాన్ని కూడా అటు ప్రియా దొంగలిస్తూ ఉండటంతో మరింత సీరియస్ అవుతాడు. ఇక ఇటీవలే నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమో విడుదల అయింది. ఇక ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఏకంగా ప్రియా సన్నీ మధ్య ఒక పెద్ద గొడవ జరిగింది అని చెప్పాలి.  ఇటీవలే బిగ్బాస్ బజర్ మోగాగానే సన్నీ పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న కోడి బొమ్మ దగ్గర నుంచి గుడ్లు సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక అటు వెంటనే అక్కడికి వచ్చిన ప్రియా వెనకనే ఉన్న సన్నీ బుట్టను ఎత్తుకెలుతుంది. అంతే కాదు నాకు బుట్ట దొరికింది అంటూ గట్టిగా చెబుతోంది. దీంతో సన్నీ సీరియస్ అవుతాడు. దమ్ముంటే గేమ్ సరిగ్గా ఆడాలని ఇలా దొంగలించడం ఏంటి అంటూ ప్రశ్నిస్తాడు. అయితే నా జోలికి వస్తే చెంప పలగొడతా అంటూ డైరెక్ట్ గా తిట్టేస్తుంది ప్రియా.  దీంతో ఒక్కసారిగా సన్నీ సీరియస్ అవుతాడు. నోరు అదుపులో పెట్టుకో అని మాట్లాడతాడు. అయితే నా జోలికి వస్తే చెంప పగిలిపోద్ది అని మరోసారి వార్నింగ్ ఇస్తుంది ప్రియా. దీంతో సన్నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొట్టు చూద్దాం అంటూ మీది మీది కి వెళ్తాడు. ఇక ఇదంతా బిగ్ బాస్ ప్రోమోలో చూపించారు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ పై అందరిలో ఆతృత పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: