
హీరోగా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఈ హీరో, అదే ప్రేక్షకులకు విలన్ పాత్రలో కనిపించి అధ్బుతమైన నటనతో అలరించాడు. ప్రత్యర్ధి పాత్రలో చేయాలంటే దర్శకులకు బెస్ట్ ఆప్షన్ గా జగపతి బాబు నిలుస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.
పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి పర్ఫెక్ట్ గా రిజల్ట్ ఇవ్వడంలో జగపతి బాబుకి తనకు తానే సాటి. విలనిజం లోనూ స్టైల్ ను చూపించి గమ్మత్తు విరజింపచేసి భళా అనిపించున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు పవర్ఫుల్ విలన్ పాత్ర కావాలంటే ఇక జగపతి బాబు మాత్రమే అనేలా విలన్ పాత్ర6ల్లో ఒదిగిపోయాడు. నాన్నకు ప్రేమతో, లెజెండ్, అరవింద సమేత, రంగ స్థలం ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు జగపతి బాబు. హీరో అయినా, విలన్ అయినా, లేదా అతిధిగా అయినా పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రాణం పెట్టి నటిస్తాడు జగపతి బాబు.
హీరోగానే కాదు విలన్ గా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక పారితోషకం పుచ్చుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో నటుడు జగపతి బాబు కూడా ఒకరు. జగపతి బాబు విలన్ గా నటించిన అన్ని సినిమాలు హిట్ అయినవే కావడం విశేషం. లెజెండ్ సినిమాతో విలన్ గా సరికొత్త అవతారం ఎత్తాడు. ఇక అప్పటి నుండి వెనుతిరిగి చూసింది లేదు.