టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లిచూపులు అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా తో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు ఈ హీరో. దీంతో యూత్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం సౌత్ ఇండియా లోనే సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్న ఈ రౌడీ హీరో తాజాగా నటిస్తున్న సినిమా 'లైగర్'. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పూరి జగన్నాథ్, చార్మి లతో కలిసి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానంతో పాటు ఓ స్టార్ హీరో కూడా ఎదురుచూస్తున్నారట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్. ఓకే బంగారం, మహానటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు దుల్కర్. తాజాగా 'కురుప్' సినిమా తో మరోసారి ఆడియన్స్ ని పలకరించి  డీసెంట్ హిట్ అందుకున్నాడు.

 ఈ సినిమాకి తమిళంతో పాటు తెలుగులో కూడా పాజిటివ్ టాక్ రావడం జరిగింది. ఇక ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'పుష్పకవిమానం' సినిమా సైతం విడుదలైంది. ఈ క్రమంలోనే పుష్పకవిమానం సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తూ దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కి స్పందించిన విజయ్ దేవరకొండ.. దుల్కర్ సల్మాన్ ని సోదరుడిగా భావిస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొనడమే కాకుండా ప్రస్తుతం తాను లైగర్ షూటింగ్లో ఉన్నట్లు చెప్పగా.. ఈ సినిమా కోసం తాను కూడా ఎదురు చూస్తున్నట్లు దుల్కర్ సల్మాన్ తెలిపాడు. దీంతో దుల్కర్ సల్మాన్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: