మాజీ హీరోయిన్ నమ్రత ఘట్టమనేని పేరు తెలియని తెలుగు వారుండరు అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఈమె కేవలం ఓ స్టార్ హీరో భార్య మాత్రమే కాదు. అంతకన్నా ముందు హీరోయిన్ కూడా. వంశీ, అంజి వంటి పలు చిత్రాల్లో నటించారు. ప్రిన్స్ తో కలిసి చేసింది ఒకే ఒక చిత్రం అపుడే ఇద్దరు లవ్ లో పడ్డారు అలా ఆ ప్రేమ బంధం పెళ్లి పీటలెక్కించింది. ఇపుడు ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తమ జీవితంలో బెస్ట్ ఫేజ్ ఇద్దరు బిడ్డలకు పేరెంట్స్ కావడం అని అంటుంటారు ఈ సెలబ్రిటీ జంట. బి గోపాల్ దర్శకత్వంలో "వంశీ" మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతున్న సమయంలో వీరి మధ్య ప్రేమ ఉందనే విషయాన్ని గుర్తించారు.

కానీ ఎవరు ముందు ప్రపోజ్ చేశారన్న విషయంపై ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది అంటూ ఈ మధ్య ఓ సారి చెప్పుకొచ్చారు నమ్రత. సినిమా షూటింగ్ కి గ్యాప్ వచ్చినప్పుడల్లా ముంబైకి వెళ్లి నమ్రతను రహస్యంగా కలసి వచ్చే వారట మహేష్. అంతగా ఆమెను చూడకుండా ఉండలేక పోయేవారట. 2005 ఫిబ్రవరి 10 న ఈ ప్రేమికులు వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత మహేష్ బాబు కెరియర్ స్పీడ్ పెరిగిందనే చెప్పాలి. వరుస సూపర్ హిట్స్ ను అందుకున్నారు మహేష్.  

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ గా క్రేజ్ పెంచుకున్న ఈ సెలబ్రిటీ కపుల్ కి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.   పెళ్లయిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై కుటుంబం పైనే దృష్టి పెట్టి గృహిణిగా తన బాధ్యతలు నిర్వహిస్తోంది.
భర్త మహేష్ బాబు సినిమాలకు సంబందించిన వర్క్స్ పర్సనల్ గా చూసుకుంటుంటారని కూడా చెబుతుంటారు. సినిమా నిర్మాణ భాగస్వామ్యం లో నమ్రత ఘట్టమనేని పేరు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: