టాలీవుడ్ సినిమా పరిశ్రమకు సంగీతం ఆయువుపట్టు లాంటిది. ఒక సినిమాకి దర్శకుడు కథ రచయిత నటీనటులు ఎలా అయితే ముఖ్యమో సంగీత దర్శకుడు కూడా అంతే ముఖ్యం . ఆయన అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసి ప్రేక్షకులను మరింత బాగా అలరించడం తో పాటు వారికి బాగా దగ్గర చేస్తుంది సినిమాను. అలా ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది సంగీత దర్శకులు తమ సంగీతం తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. సంగీతంలోని సరికొత్త రకమైన వైవిధ్యభరితమైన సంగీతాన్ని ప్రదర్శిస్తూ ఇప్పటిదాకా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

ఇక ఈ తరం సంగీత దర్శకుల్లో పోటీ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా టాప్ ఫైవ్ సంగీత దర్శకుల మధ్య  మంచి పోటీ నెలకొంది. నెంబర్ 1,2 స్థానాల్లో తమన్ మరియు దేవిశ్రీప్రసాద్ ల మధ్య మంచి ఉండగా ఆ తర్వాత స్థానాలకు కూడా బాగానే పోటీ నెలకొంది.  మన టాలీవుడ్ సంగీత దర్శకులలో నెంబర్ 3 కి పోటీ పడే మొదటి అభ్యర్థి మిక్కి జే మేయర్. మొదటి నుంచి ఆయన సంగీతం కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉండగా ఆయన ఈ స్థానానికి అర్హుడు అని అయన చేసిన సినిమాలే చాటి చెబుతున్నాయి.

ఇక ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలు తప్పకుండా ఆయనకు మంచి పేరు తీసుకు వస్తాయి అని అంటున్నారు. ప్రభాస్ హీరోగా చేస్తున్న ప్రాజెక్టు కె సినిమాకి ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా ఈ సినిమాతో ఆయన టాప్ రేంజ్ కి వెళ్లడం ఖాయం అని చెబుతున్నారు. మొదట్లో చిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని ముందుకు వెళ్లిన మిక్కి.జె.మేయర్ ఆ తర్వాత పెద్ద హీరోలకు సంగీతం అందించే స్థాయిని అందుకున్నాడు. మహేష్ బాబు వరుణ్ తేజ్ ఇప్పుడు ప్రభాస్ వంటి హీరోలకు ఆయనే సంగీతం సమకూరుస్తూ నెంబర్వన్ స్థానానికి అందుకునేలా దూసుకుపోతున్నాడు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: